తిరుపతి రుయా ఆసుపత్రిలో కరోనా రోగులకు అందని ఆక్సిజన్ : 11 మంది రోగుల మృతి

By narsimha lodeFirst Published May 10, 2021, 10:23 PM IST
Highlights

తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.  20 నిమిషాల పాటు  ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టుగా రోగుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంంది రోగులు మృతి చెందారు. మరో 30 మంది  పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

రుయా ఆసుపత్రిలో సోమవారం నాడు రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆక్సిజన్ జరగలేదు.  దీంతో ఆసుపత్రిలో అప్పటికే 135 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.  ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో  రోగుల బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు నుండి ఆక్సిజన్ ట్యాంకర్ 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. ఆక్సిజన్ అందని కారణంగా 11 మంది మరణించారని కలెక్టర్ తెలిపారు. 

 ఆక్సిజన్ అందని కారణంగా  మరో 30 మంది  రోగుల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో రోగుల బంధువులు ఆసుపత్రిలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.   ఇదిలా ఉంటే సోమవారం నాడు రాత్రి  రుయా ఆసుపత్రి వద్దకు కలెక్టర్, ఎస్పీ చేరుకొన్నారు. ఈ ఘటనపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. రుయా ఆసుపత్రిలో చోటు చేసుకొన్న పరిణామాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 
 
click me!