విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో పోలీసుల ఆంక్షలు.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Oct 24, 2022, 2:14 PM IST
Highlights

దీపావళి పండగ నేపథ్యంలో విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డులో బాణాసంచా కాల్చవద్దని విశాఖపట్నం సీపీ సీహెచ్ శ్రీకాంత్ హెచ్చరికలు జారీచేశారు.

దీపావళి పండగ నేపథ్యంలో విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డులో బాణాసంచా కాల్చవద్దని విశాఖపట్నం సీపీ సీహెచ్ శ్రీకాంత్ హెచ్చరికలు జారీచేశారు. అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలపై పోలీసులు నిఘా ఉంచారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీకాంత్ తెలిపారు. అయితే సందర్శకులు బీచ్ రోడ్డుకు యథావిథిగా వెళ్లొచ్చని చెప్పారు.  

విశాఖప‌ట్నం ప్ర‌జ‌లు దీపావళి వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సీపీ శ్రీకాంత్ సూచించారు. విశాఖలోని 30 ప్రాంతాలలో 420 బాణాసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. షాప్‌కు షాప్‌కు మధ్యలో మూడు మీటర్ల దూరం ఉండేలా చూడాలని అన్నారు. సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయవాడ, తిరుపతిలలో బాణాసంచా దుకాణాలలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బాణాసంచా దుకాణాలను పర్యవేక్షించడానికి డీసీపీ స‌హా వివిధ స్థాయిల అధికారుల‌ను నియ‌మించిన‌ట్టు వివ‌రించారు.

ఇదిలా ఉంటే.. విశాఖ నగరంలోని బాణసంచా విక్రయించే స్టాల్స్ వద్ద నిర్దేశించిన నిబంధనలు అమలు చేసేందుకు పోలీసు అధకారులు చర్యలు తీసుకున్నారు. స్టాల్స్ యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచే నగరంలో దీపావళి పండగ శోభ నెలకొంది. పండగ సందర్భంగా పూజ సామాగ్రి, టపాసులు కొనుగోలు చేసేందుకు వచ్చినవారితో మార్కెట్ల పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.  ఈ ఏడాది కోవిడ్ నిబంధనలు లేకపోవడంతో.. రెండేళ్ల తర్వాత పండగను ఘనంగా జరుపుకునేందుకు జనాలు సిద్దమవుతున్నారు. 
 

click me!