వినాయకచవితి వేడుకలపై ఆంక్షలు... విశాఖలో బిజెపి ధర్నా, జివిఎంసి వద్ద ఉద్రిక్తత (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 6, 2021, 3:53 PM IST
Highlights

వినాయకచవితి వేడుకలపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో బిజెపి శ్రేణులు ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో జివిఎంసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

విశాఖపట్నం: వినాయకచవితి వేడుకలపై జగన్ సర్కార్ ఆంక్షలు విధించడంపై ఏపీ బిజెపి ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో బిజెపి శ్రేణులు ధర్నా చేపట్టాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్దగల గాంధీ విగ్రహం ఎదుట బిజెపి ఎమ్మెల్సీ మాదవ్, స్వామీజీ శ్రీనివాస స్వరూపానందతో పాటు నగర బిజెపి నాయకులు ధర్నాకు కూర్చున్నారు. 

ఈ క్రమంలో జివిఎంసి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బిజెపి శ్రేణులు కార్యాలయంలోకి వెల్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బిజెపి శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం జివియంసి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసారు. 

ఈ ధర్నా సందర్బంగా ఎమ్మెల్సీ మాదవ్ మాట్లాడుతూ... హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. హిందూ వ్యతిరేక నిర్ణయంతో రాష్ట్రంలో గల కోట్లాది భక్తుల మనోభావాలను ఈ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. హిందూ పండగ అయిన వినాయ చవితిపై ఆంక్షలు విదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని...లేదంటే రాష్ట్రంలోని అన్ని ధార్మిక సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని మాధవ్ హెచ్చరించారు. 

వీడియో

విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు మేడపాటి రవీంద్ర మాట్లాడుతూ... కరోన నెపంతో వేలాది కళాకారులు, కుమ్మరిలు, పూజా సామగ్రి అమ్మే చిరు వ్యాపారుల పొట్టగొట్టడం దుర్మార్గామని అన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా అద్యక్షులు సురేంద్రమోహన్, నాయకులు వంశీ యాదవ్, డా.సుహాసినీ, ఆనంద్,  శ్రీనివాసుల నాయుడు, శివాజీ, కరణంరెడ్డి, నరసింగరావు, ప్రసాద్, పొలిమేర శ్రీను, లలిత, దానేష్ చక్రవర్తి, మంజుల, గూటూరు శంకరరావు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
 

click me!