శ్రీకాకుళంలో ఎలుగుబంటి ఆపరేషన్ సక్సెస్: భల్లూకాన్ని బంధించిన అధికారులు

By narsimha lodeFirst Published Jun 21, 2022, 12:15 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలో  మూడు రోజులుగా స్థానికులకు  భయబ్రాంతకులకు గురిచేసిన ఎలుగు బంటికి రెస్క్యూ టీమ్  మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. అరగంట తర్వాత  ఎలుగు బంటిని అధికారులు బంధించి విశాఖ పట్టణం జూలో వదిలివేయనున్నారు. 
 

శ్రీకాకుళం:మూడు  రోజులుగా Srikakulam District జిల్లా వాసులకు చుక్కలు  చూపించిన Bearని Forest Officers బంగళవారం నాడు బంధించారు.  మూడు రోజులుగా స్థానికులకు ఎలుగు బంటి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 

శ్రీకాకుళం జిల్లాలోని Vajrapukotturu మండలం Kidisingi  గ్రామంలోని రేకుల షెడ్ లో దూరిన ఎలుగు బంటికి మంగళవారం నాడు  రెస్క్యూ సిబ్బంది మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. అరగంట పాటు  ఎలుగుబంటిని పరీక్షించనున్నారు.  ఆ తర్వాత ఎలుగుబంటిని సమీపంలోని జూలో  వదిలివెళ్లే అవకాశం ఉంది. 

ఆదివారం నాడు జీడితోటల వద్ద ఓ రైతు ఎలుగు బంటి దాడిలో మరణించాడు. ఈ ఘటన జరిగిన మరునాడే  ఆరుగురు రైతులపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన వారంతా శ్రీకాకుళం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  జీడితోటల్లో ఎలుగు బంటి దాక్కొని మూడు రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తుంది. 

 కిడిసింగి గ్రామానికి చెందిన కలమట కోదండరావును ఆదివారం జీడితోటల వైపు వెళ్తుండగా ఎలుగుబంటి చంపింది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున రెండు ఆవులను తొక్కి చంపేసింది. సోమవారం నాడు జీడీ తోటలో పనిచేస్తున్న తామాడ షణ్ముఖరావుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు యువకులు అప్పలస్వామి, చలపతిరావు, సంతోష్ షణ్ముఖరావును కాపాడే ప్రయత్నం చేశారు.ఈ ముగ్గురిపై కూడా ఎలుగుబంటి దాడి చేసింది.  మాజీ సైనికుడు పోతనపల్లి తులసీరావు, ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్న అతని సోదరుడు పురుషోత్తంలు కూడా ఎలుగు బంటిని పట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఎలుగు బంటి  అక్కడి నుండి తప్పించుకొని పోయింది. ఆహారం కోసం  ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి ఉంటుందని అటవీశాఖాధికారలుు అనుమానిస్తున్నారు. 

సోమవారం నుండి కిడిసింగి గ్రామ సమీపంలోని రేకుల షెడ్ లో ఎలుగుబంటి ఉన్న విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇవాళ ఉదయం నుండి ఎలుగుబంటికి మత్తు ఇచ్చేందుకు అధికారులు  చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఎలుగుబంటి మత్తులోకి చేరుకున్న తర్వాత బోనులో  అధికారులు ఎలుగుబంటి విశాఖ జూకి తరలించారు. 

also read:శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి:మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశం

ఎలుగు బంటి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 2.5లక్షలు రూపాయలు చెల్లిస్తామని అనంతరం మరొక 2.5లక్షలు రూపాయలు మొత్తంగా ప్రభుత్వం తరపున 5లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని  చెప్పారు.బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని మంత్రి డాక్టర్ సీదిరి అన్నారు

click me!