ఇకపై ఏ ఒక్క దేవాలయంపై దాడి జరిగినా ఊరుకోం: ఎమ్మెల్యే అనగాని హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Jan 06, 2021, 03:38 PM IST
ఇకపై ఏ ఒక్క దేవాలయంపై దాడి జరిగినా ఊరుకోం: ఎమ్మెల్యే అనగాని హెచ్చరిక

సారాంశం

వైసిపి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే సుమారు 70 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.

గుంటూరు: రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతోందని రేపల్లె టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కులాన్నే టార్గెట్ చేస్తోందన్నారు.  రాష్ట్ర ప్రజలపై విపరీతమైన పన్నుల భారం వేస్తున్నారని ఆరోపించారు. కేవలం 19 నెలల కాలంలో లక్షా 36 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనత భారత దేశంలో మన రాష్ట్రానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

''అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో సుమారు 70 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో నెడుతున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక వనరులు పెంచే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయటం లేదు'' అని అన్నారు.

''పెట్రోలు, డీజిల్ పై ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పన్నులు వేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన రైతుల పరిస్థితి పట్టించుకోవటం లేదు. కులాలు మతాలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు విద్వేషాలను రెచ్చ గొడుతున్నారు.పనికిమాలిన మంత్రులు,ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపక్షాల మీద మాట్లాడుతున్నారు'' అని మండిపడ్డారు.

read more ఇది తెలంగాణ కాదు.. ఏపీ, ఇక్కడ జగన్ వున్నాడు: సంజయ్‌కి అంబటి వార్నింగ్

''రాబోయే రోజుల్లో ఏ ఒక్క దేవస్థానంపైన దాడులు చేసినా చూస్తూ ఊరుకోం. ఇప్పటివరకు జరిగిన దాడులపై హోంమంత్రి, డిజిపి సమాధానం చెప్పే అవసరం లేదా? అలా కాకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉంది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే'' అన్నారు.

''రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గంప మట్టి పోశారా? ప్రతి స్కీములో అవినీతే. టిడ్కో ఇల్లు ఇస్తే మాకు పేరొస్తుందని ఇవ్వలేదు. మేము ప్రజా సమస్యలపై పోరాడతాం ప్రజల పక్షాన ఉంటాం'' అని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu