టీడీపీకి ఈసీ షాక్.. ‘వైఎస్ జగన్‌పై అభ్యంతరకర పోస్టులు తక్షణమే తొలగించాలి’

By Mahesh KFirst Published Mar 19, 2024, 2:26 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీకి ఈసీ ఝలక్ ఇచ్చింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయరాదని, ఇది వరకే ఉన్న అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
 

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా టీడీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అప్‌లోడ్ చేసిన అభ్యంతరకర పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేల్ల అప్పి రెడ్డి ఫిర్యాదు పై ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్సీ అప్పి రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. టీడీపీ పోస్టులు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి లేవని, కాబట్టి, వాటిని వెంటనే టీడీపీ తొలగించాలని ఆదేశించారు. ఈ మేరకు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు నోటీసులు పంపించారు.

ఇక పోతే టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా చిలకలూరిపేట బహిరంగ సభ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాపర్‌ను వినియోగించారని ఆరోపించారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ  నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సభ కోసం ఆయన ఎయిర్ ఇండియా ఫోర్స్ హెలికాప్టర్‌ను వినియోగించుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సొంత పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్మును వినియోగించరాదు.

click me!