వల్లభనేని వంశీ : బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

By Rajesh KarampooriFirst Published Mar 19, 2024, 1:00 PM IST
Highlights

Vallabhaneni Vamsi Biography: తెలుగు దేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని .. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే అయినా విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేత. గతంలో పరిటాల రవి ప్రధాన అనుచరుగా గుర్తింపు పొందారు. నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి.. సినిమాలకు నిర్మాతగా మారిన వ్యక్తి .. ఆయనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర  పోషిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ ఎంటో తెలుసుకుందాం.

Vallabhaneni Vamsi Biography: 
 
బాల్యం, విద్యాభ్యాసం

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ .. 1972లో రమేష్ చంద్, అరుణ గారి దంపతులకు ఏపీలోని కృష్ణా జిల్లా, గన్నవరంలో జన్మించాడు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే. చిన్నతనం నుంచి చదువుల్లో చురుకగా ఉండేవారు. ఆయన ఉంగుటూరులో ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆ సమయంలో ఏడో తరగతిలో ఆయన స్టేట్ బ్యాంక్ కూడా పొందారు. ఎనిమిదో తరగతి నుంచి పదోవ తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు.ఆ సమయంలో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు. విజయవాడ గౌతమ్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి.. వెటర్నరీ డాక్టర్ గా మాస్టర్ కోర్స్ ని తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత వంశీ అమెరికా వెళ్దామని ప్రయత్నించారు.కానీ, ఆయనకు వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు. ఈ తరుణంలో రియల్ ఏస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశారు. 

ప్రారంభ జీవితం

ఈ తరుణంలో పరిటాల రవి ఆయనకు పరిచయం ఏర్పడింది. అతికొద్ది రోజుల్లోనే పరిటాల రవికి వంశీ ప్రధాన అనుచరుడిగా మారారు. ఈ సమయంలో పలు వ్యాపారాలు కూడా చేస్తారు. వంశీని పరిటాల రవి సొంత తమ్ముడిలా చూసుకునేవారట.  పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో ప్రయాణించడానికి అందరూ భయపడేవారట. కానీ , వంశీ మాత్రం ఆయనతో ఎలాంటి భయం లేకుండా ప్రయాణం చేసేవారు. ఆయన ముఖ్య అనుచరుడిగా పేరు సంపాదించుకున్నారు. 

రాజకీయ ప్రవేశం 

మరోవైపు..  వంగవీటి రాధా, కొడాలి నాని ఆయనకు మంచి స్నేహితులు. ఈ సమయంలో కొడాలి నానితో నందమూరి కుటుంబంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఏర్పడింది. ఇలా తారక్, హరికృష్ణలో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.  ఇక రాజకీయాల్లోకి రావాలని కోరికతో 2006లో ఆయన టిడిపిలో చేరారు. ఈ సమయంలో 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి.. ఎన్టీఆర్ సహాయం చేశారు. ఎన్టీఆరే దగ్గరుండీ ఎంపీ టికెట్ ఇప్పించారట.  

ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈ సమయంలోనే వంశీ ద్రుష్టి సినిమాల మీద పడింది. ఆయన సినిమా నిర్మాతగా మారారు. 2009లో పున్నమినాగు, 2010లో జూ. ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమా నిర్మించారు. ఆ తర్వాత రవితేజతో 2018లో టచ్ చేసి చూడు అనే సినిమాను కూడా తీశారు.

రాజకీయ జీవితం 

ఇక ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే.. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుట్ట రామచంద్రరావు పై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సిపి లో చేరతారని వార్తలు వినిపించాయి. ఈ సమయంలో వంశీని జగన్ ఆలింగనం చేసుకున్న దృశ్యం చాలా మందికి గుర్తుండేంటుంది. కానీ, పార్టీ మారకుండా టిడిపిలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైసీపీలో చేరిక

అయితే ఈ ఎన్నికల తరువాత ఆయన టిడిపికి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ టీడిపిని విడి వైసీపీకి మద్దతుగా ఉండడంతో టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆ పార్టీని వీడిన ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నాడు. రానున్న ఎన్నికల్లో ఆయన వైసీపీ తరుపున గన్నవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

click me!