ఉండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 19, 2024, 1:28 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండి ఒకటి. ఇది నరసాపురం లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు వున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి హవా గట్టిగా వీచినా ఉండిలో మాత్రం టిడిపిని ఓడించలేకపోయింది. మరి ఈసారి ఉండి ప్రజలు ఎవరిపక్షాన నిలుస్తారో చూడాలి. 

ఉండి రాజకీయాలు : 

ఉండి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టిడిపి ఆవిర్భావం తర్వాత కేవలం ఒకేఒక్కసారి (2004లో కాంగ్రెస్ చేతిలో) పసుపుపార్టీ ఓటమిపాలయ్యింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కలిదిండి రామచంద్రరాజు మొదటిసారి టిడిపి తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన విజయపరంపర కొనసాగుతూ వచ్చింది. వరుసగా ఐదుసార్లు (1983,1985,1989,1994,1999) ఉండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి చరిత్ర సృష్టించారు రామచంద్రరాజు. 

2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి సీటు కాంగ్రెస్ కు దక్కింది. ఆ తర్వాత మళ్లీ టిడిపి విజయాలబాట పట్టింది.  2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేటుకూరి వెంకట శివరామరాజు, 2019 లో మంతెన రామరాజు విజయం సాధించారు. ఇప్పటివరకు ఉండి అసెంబ్లీపై వైసిపి జెండా ఎగరలేదు. 
 
ఉండి నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. పాలకోడేరు
2. ఆకివీడు
3.  కల్లా
4.  ఉండి

ఉండి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,19,572
పురుషులు -  1,08,386
మహిళలు ‌-  1,11,175

ఉండి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన పివిఎల్ నరసింహరాజునే మళ్లీ బరిలోకి దించుతోంది వైసిపి. 2019 లో ఓటమిపాలైనా వైసిపిని బలోపేతానికి ఈ ఐదేళ్లు కృషిచేసారు నరసింహరాజు. దీంతో అతడినే ఉండి పోటీలో నిలిపారు వైసిపి అధినేత వైఎస్ జగన్.

టిడిపి అభ్యర్థి :  

సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు మరోసారి ఉండి పోటీలో నిలిచారు. ఉండి నియోజకవర్గం టిడిపికి కంచుకోట కావడంతో ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు చేయలేరు చంద్రబాబు. గత ఎన్నికల్లో వైసిపి హవా గట్టిగా వీచినా ఉండిలో మాత్రం టిడిపిని గెలిపించిన రామరాజుపైనే నమ్మకం వుంచారు టిడిపి అధినేత.

ఉండి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

ఉండి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,86,077 (84 శాతం)

టిడిపి - మంతెన రామరాజు - 82,730 ఓట్లు (44 శాతం) - 10,949 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - పివిఎల్ నరసింహరాజు  - 71,781 (38 శాతం) - ఓటమి

సిపిఐ - బి. బలరామరాజు - 24,737 (13 శాతం) - ఓటమి
 

ఉండి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,74,422 (86 శాతం)

టిడిపి - వేటుకూరి వెంకట శివరామరాజు - 1,01,530 (58 శాతం) ‌- 36,231 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - పాతపాటి సర్రాజు - 65,299 (37 శాతం) - ఓటమి 


 

click me!