ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు...

By SumaBala Bukka  |  First Published Jan 18, 2024, 9:15 AM IST

బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.


హైదరాబాద్ : నేడు ఎన్టీఆర్ వర్థంతి. ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు. ఇవ్వాళ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ లో తాతగారికి నివాళులు అర్పించారు. 

ఎన్టీవీలో ప్రసారమైన ఓ వీడియోలో ఇందూపూర్ ఎమ్మెల్యూ బాలకృష్ణ తన అనుచరులతో ఫ్లేక్లీలను ఉద్దేశించి.. ‘ఇప్పుడే’.. ‘తీయించేయ్’ అంటున్నట్టుగా ప్రసారం అయ్యింది. బాలకృష్ణ అక్కడినుంచి వెళ్లగానే ఫ్లెక్సీలు తొలగించడంతో ఇప్పుడు ఆయన అన్నమాటలు వాటిని ఉద్దేశించే అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest Videos

 

click me!