Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కన్నీళ్లు తెప్పించిన అభిమాని లేఖ..  ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..?

Published : Jan 18, 2024, 08:47 AM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు కన్నీళ్లు తెప్పించిన అభిమాని లేఖ..  ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..?

సారాంశం

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఐర్లాండ్ నుంచి ఓ అభిమాని బహిరంగ లేఖ రాశాడు. తమ కోసం నిలబడుతున్నా.. జనసేనాని కోసం బలపడతామని, రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడు పవన్ కళ్యాణ్ నే అంటూ అభిమాని లేఖ రాశారు. ఈ లేఖకు చదివిన పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి గురయ్యారు.  

Pawan Kalyan : జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టార్ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గోంటున్నాడు. ఈ తరుణంలో ఆయనను ఎంతో మరింత ఫాలో అవుతుంటారు. వారు ఇచ్చే సూచనలకు కూడా పవన్ పరిగణనలోకి తీసుకుంటారు.  

తాజాగా ఐర్లాండ్‌ నుంచి ఓ అభిమాని రాసిన లేఖకు పవన్ కళ్యాణ్ ఉద్వేగపూరిత సమాధానం ఇచ్చారు. ఆ ఉత్తరం చదివిన వెంటనే తన గొంతు దుఃఖంతో పూడుకుపోయిందనీ, తన కంట  కన్నీరు తెప్పించావంటూ.. అభిమాని రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "ఐర్లాండ్ దేశంలో  ‘ఓడ కళాసీకి’గా పనిచేస్తున్న నా ప్రియమైన జనసైనికుడి ఉత్తరం అందింది. ఆ ఉత్తరం చదివిన వెంటనే, గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు.. కార్యోన్ముఖుడిని చేసావు.." అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. 

గతేడాది డిసెంబర్ 19న ఐర్లాండ్‌ నుంచి అభిమాని ఉత్తరం రాయగా.. తాజాగా అది పవన్‌కు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరలవుతోంది

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందంటే..

"అన్నా..  కష్టాలు, కన్నీళ్లు,రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ.. నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళందరికో ఒక్కటే నీ మీద ఆశ..! ఎక్కడో బొలీవీయా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా..? సరికొత్త గెరిల్లా వార్ ఫెయిర్‌ను మొదలెట్టక పోతావా..? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్ని మార్చుకోకపోతామా..? 17 ఏళ్లుగా ఈ ( భారత్) దేశంలో లేకపోయినా.. దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురుచూస్తున్న నాలాంటి వారందరూ.. మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం..

2014 - నిలబడ్డాం
2019 - బలపడ్డాం
2024 - బలంగా కలబడదాం!


 
కారు మీదేక్కేటప్పుడు జాగ్రత్త అన్నా, కారుకూతల్ని పట్టించుకోకు అన్నా, కారుమబ్బులు కమ్ముతున్న కార్యోన్ముఖుడివై వెళుతున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా.. పవర్ స్టార్ వే కదన్నా.. Common man protection force ని ప్రకటించినప్పుడే నిన్ను హీరోగా చూడటం మానేశాను. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివి.. ఇట్లు.. ఐర్లాండ్ నుంచి ఓ ఓడ కళాసీ" అంటూ ఆ అభిమాని లేఖ రాశారు. ఈ లేఖను జనసేనాని తన ట్విట్టర్ (ఎక్స్) లో షేర్ చేయడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం