కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

By narsimha lode  |  First Published Nov 26, 2021, 12:51 PM IST

కడప జిల్లాలోని మైదుకూరు వద్ద ఫారెస్ట్ అధికారులపై దాడి చేసి పారిపోయారు తమిళ కూలీలు.  ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులకు చిక్కుతామనే భయంతో  ఓ వాహనం నుండి కూలీలు కిందకు దూకారు.త ఈ క్రమంలో ఓ కూలీ మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.


కడప: కడప జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఫారెస్ట్ అధికారులపై దాడికి దిగారు.  ఫారెస్ట్ అధికారుల నుండి తప్పించుకొనే క్రమంలో వాహనం దూకిన ఓ కూలీ మృతి చెందగా,  మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు నియోజకవర్గంలోని కాజీపేట మండలంలో ఉన్న Nallamalla అటవీ ప్రాంతంలో  Red  sandalwood  స్మగ్లింగ్ చేయడానికి  Tamilnadu కూలీలు వచ్చారు. అయితే  Mydukur కు సమీపంలోని  ఫ్లైఓవర్ వద్ద తమిళ కూలీలను గుర్తించిన అటవీశాఖాధికారులు  వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో  తమిళనాడు Labour పారెస్ట్ అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ అధికారి ఒకరు గాయపడ్డారు. ఆ తర్వాత వాహనంలో తమిళ కూలీలు పారిపోతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు వారిని సినీ ఫక్కిలో  వెంటాడారు. అయితే ఈ సమయంలో  ఫారెస్ట్ అధికారులకు చిక్కుతామనే భయంతో  వాహనం నుండి ముగ్గురు  కూలీలు  ఈ ఘటనలో ఒక తమిళ కూలీ మరణించాడు.  మరో ఇద్దరు కూలీలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో  చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లరకు ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఎర్ర చందనం  స్మగ్లర్లపై పోలీసులు జరిపిన కాల్పుల్లో  20 మంది తమిళ కూలీలు మరణించారు. ఈ ఘటన 2015 ఏప్రిల్ 7వ తేదీన చోటు చేసుకొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. అయినా కూడా రాష్ట్రంలో ఎర్ర చందనాన్ని స్మగ్లర్తు తరిలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు నుండి వచ్చే కూలీలను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా  మైదుకూరు వద్ద తమిళకూలీలను గుర్తించి ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేస్తుండగా దాడి చేసి కూలీలు పారిపోయే ప్రయత్నం చేశారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Latest Videos

undefined

రాష్ట్రంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగర్లు ఫారెస్ట్ అధికారులపై 2018 జూలై 15న రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో  ఫారెస్ట్ వాచర్ ఆశోక్  మరణించాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం టాస్క్ పోర్స్ ను పటిష్టం చేయాలని  నిర్ణయం తీసుకొంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ జరగకుండా  ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటుంది. 
 

 

click me!