పెళ్లి చేసుకుని ఏడాదైంది.. అంతలోనే..

By Rekulapally SaichandFirst Published Jan 6, 2020, 6:08 PM IST
Highlights

హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రెడ్డి సూర్య వెంకటశివ  ఓ ఉన్మాది చేతిలో  ప్రాణాలు కోల్పోయాడు. బొకారో ట్రైన్‌ లో జరిగిన చిన్న గొడవ అతని ప్రాణాలు తీసింది.

విధి ఎంత దారుణమైనది మనము ఒక్కటి తలుస్తే అది ఒక్కటి తలుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోంది.. ఎలా జరుతోందో తెలయని ప్రపంచంలో మనం బతుకుతున్నాం.   అవేశంతో ఎదుటివారి ప్రాణాలు తీసే ఉన్నాదులు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు . చిన్న చిన్న పొరపాట్లే మరొక్కరి  ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి. తాజాగా  తూర్పుగోదావరి జిల్లాలో కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టించే  ఘటన ఒక్కటి చోటుచేసుకుంది. 

కర్తవ్య నిర్వహణలో తన ప్రాణాలు పణంగా పెట్టాడో ఓ హోంగార్డు. అక్కడ ఉన్నది విచక్షణ లేని మనిషి తెలిసి  ఉందని తెలిసి కూడా అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయబోయి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు, వివవాల్లోకి వెళ్ళితే..  రెడ్డి సూర్య వెంకటశివ అనే వ్యక్తి టనందూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా  నిర్వహిస్తున్నాడు. ఆదివారం శివ డ్యూటీ ముగించుకొని  ఇంటికి వెళ్ళడం కోసం సామర్లకోటలో బొకారో ట్రైన్‌ ఎక్కాడు. ఇంతలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబీబ్‌ అనే వ్యక్తి ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం మెుదలుపెట్టారు. అతన్ని గమనించిన శివ వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో హంసవరం సమీపంలో ట్రైన్‌ నుంచి శివను బయటకు తోసేయడంతో  అతను తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. 


వివాద రహితుడు ఉండే శివ ఓ ఉన్నాది చేతిలో ప్రాణాలు కొల్పోవడం అందర్ని కలిచివేసింది. అతన్నే నమ్ముకున్న కుటుంబం అనాధగా మారింది.తల్లి, భార్య దిక్కులేనివారయ్యారు.  శివ  తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందారు. ప్రస్తుతం తల్లితో కలిసి ఉంటున్నాడు. అతనికి నలుగురు అక్కలు, అన్నయ్య ఉన్నారు. నలుగురు అక్కలకు పెళ్లిలు జరిగి ఎవరికీ వారుగా ఉంటున్నారు. సోదరుడు ఉళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి మాత్రం అతనితో ఉంటుంది. 10వ తరగతి చదివిన  శివ కోటనందూరు పోలీసు స్టేషనులో హోంగార్డు ఉద్యోగంలో చేరాడు.

విశాఖ జిల్లా దేవిని 2018లో శివ వివాహం చేసుకున్నాడు. అన్యోనంగా ఉంటున్న వారి జీవితంలో ఆ ఉన్మాది తీరని విషాదాన్ని మిగిల్చాడు. తోటి ఉద్యోగులతో కలివిడిగా మెలిగే శివ ఆకస్మిక మరణంతో వారందరూ నైరశ్యంలో మునిగిపోయారు.  అతని మరణం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది.  వారు రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.
 

click me!