అసోం సీఎస్ గా శ్రీకాకుళం వాసి: బాధ్యతలు చేపట్టిన రవి

Published : Apr 02, 2024, 08:04 AM ISTUpdated : Apr 02, 2024, 09:12 AM IST
అసోం సీఎస్ గా శ్రీకాకుళం వాసి: బాధ్యతలు చేపట్టిన రవి

సారాంశం

అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవి  బాధ్యతలు స్వీకరించారు.

న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  కె. రవి  సోమవారం నాడు బాధ్యతలు చేపట్టారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కోటపాడు రవి స్వగ్రామం.1993 బ్యాచ్  ఐఎఎస్ అధికారి రవి. 

వాణిజ్యం, పరిశ్రమలు, ఆర్ధిక శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల బాధ్యతలను కూడ  ఆయనే నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో  రవి పలు హోదాల్లో పనిచేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో  భారత రాయబార కార్యాలయంలో కూడ  రవి పనిచేశారు. 

అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  పవన్ కుమార్ బోర్తకూర్ పదవీ కాలం మార్చి  31తో ముగిసింది. దీంతో  రవిని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉల్ఫా తీవ్రవాదులతో జరిగిన  శాంతి ఒప్పందంలో  రవి కీలక పాత్ర పోషించారు.  ఢిల్లీలోని అసోం  భవన్ లో రెసిడెంట్  కమిషనర్ గా కూడ  ఆయన పనిచేశారు.

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే