పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇల్లు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
విజయవాడ:కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తెచ్చి తనను,తన సిబ్బందిని గాయపరుస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.సోమవారం నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలను కలవాలనేది తన కోరికగా ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని రెండు లక్షల మందిలో ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలనుకుంటున్నానన్నారు. అయితే జనం ఎక్కువగా పోగైన సమయంలో కిరాయి మూకలు సన్నని బ్లేడ్లతో తనపై, తన సిబ్బందిని గాయపరుస్తున్నానరి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అందుకే భద్రత కట్టుదిట్టం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలిసే భద్రత ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు.
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడంతో పిఠాపురం వాళ్లు గెలిపిస్తామని పిలిచారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక్కసారి విజయం అంటే ఏమిటో చూపించమని కోరుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.
undefined
పిఠాపురంలో తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసే బాధ్యతను తాను తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకొని మీ కోసం అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
రాజకీయాల్లోకి కొత్తతరం నాయకులు తయారు కావాలనే ఆకాంక్షను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.ఇందు కోసం ఇప్పటి నుండే నాయకులు తయారు కావాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.కష్టపడి పనిచేసిన వారికి జనసేనలో గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey