తిరుపతి ఉపఎన్నిక: రిజల్ట్స్‌ను ఆపండి.. ఏపీ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్

Siva Kodati |  
Published : Apr 20, 2021, 08:11 PM IST
తిరుపతి ఉపఎన్నిక: రిజల్ట్స్‌ను ఆపండి.. ఏపీ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్

సారాంశం

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రత్నప్రభ పిటిషన్‌లో పేర్కొన్నారు

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప ఎన్నిక ఫలితాలను నిలుపుదల చేయాలని కోరుతూ.. బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రత్నప్రభ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని ఉన్నత న్యాయస్థానం రేపు విచారించే అవకాశం వుంది. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీతో 32 మందిని చేర్చారు రత్నప్రభ. 

ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా భారీ ఎత్తున దొంగ ఓట్ల దందా నడిచిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సీఈసీకి లేఖ రాశారు.

Also Read:ఓట్లు వేసినోళ్లంతా రౌడీలు, గుండాలే... తిరుపతి జనాలు కాదు: రత్నప్రభ ఆరోపణలు

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక సందర్బంగా తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీపోలింగ్ జరపాలని కోరారు.

అటు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణలో ఈసీ విఫలమైందని వారు తెలిపారు. అన్ని చోట్లా దొంగ ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ రద్దు కోరామని వెల్లడించింది.

కడప నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. నోడల్ అధికారుల నుంచి వివరాలు తీసుకుని ఈసీ విచారణ జరపాలని కోరారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu