చేతబడి నెపంతో దారుణం: పెదనాన్నను చంపేశారు.

Published : Mar 11, 2021, 05:25 PM IST
చేతబడి నెపంతో దారుణం: పెదనాన్నను చంపేశారు.

సారాంశం

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గోగులబాకలో  చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. 

కాకినాడ:: తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గోగులబాకలో  చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. 

ఈ నెల 5వ తేదీన అయ్యవారిపేటలో రత్తయ్య  అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రత్తయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే ఈ క్రమంలోనే పోలీసులకు అందిన సమాచారం మేరకు రత్తయ్య  తమ్ముడి కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో రత్తయ్యను చంపినట్టుగా వారు ఒప్పుకొన్నారు.

రత్తయ్యను ఆయన తమ్ముడి కొడుకులు ప్రసాద్, సత్యనారాయణలు  చంపారు. చేతబడి నెపంతోనే ఆయనను చంపాల్సి వచ్చిందని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. 

మృతదేహాన్ని గోదావరి తీరంలో ఇసుకలో పూడ్చిపెట్టారు.  నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలంలో రత్తయ్య మృతదేహం కోసం వెతుకుతున్నారు.

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు