ఏపీలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా: తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో 10 మందికి పాజిటివ్

By Siva KodatiFirst Published Mar 11, 2021, 4:22 PM IST
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కలకలం రేగింది. మున్సిపల్ కార్యాలయంలో నలుగురు అధికారులతో పాటు మొత్తం 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కలకలం రేగింది. మున్సిపల్ కార్యాలయంలో నలుగురు అధికారులతో పాటు మొత్తం 10 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

కరోనా పాజిటివ్ వచ్చిన ప్రైమరీ కాంటాక్ట్‌పై ఆరా తీస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పాజిటివ్ రావడంతో మిగిలిన సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. 

కాగా, ఏపీలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. వారం నుంచి నిత్యం వందకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 120 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 8,91,004 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 7177 కి పెరిగింది.

కాగా.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 93 మంది కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ నుంచి 8,82,763 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,064 యాక్టివ్ కేసులు వున్నాయి.
 

click me!