ఓ చిన్నారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకబికినా 33 నదుల పేర్లు గుక్క తిప్పుకోకుండా చెప్పి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.
గుంటూరు : పిట్ట కొంచెం.. కూత ఘనం అనే నానుడి ఇలాంటి వారిని చూసే వచ్చిందేమో అనిపిస్తోంది. ఎంతో కష్టపడితే గానీ రికార్డులు సొంతం కావు.. కానీ నాలుగేళ్ల పసిప్రాయంలోనే ఓ చిన్నారి ‘India Book of Records’లో చోటు సాధించింది. ఇంతకు ఆ పాప ఏం చేసిందంటే..
Guntur జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటకు చెందిన చిన్నారి కనుమూరి యోగాశ్రిత అరుదైన రికార్డు సాధించింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే 33 నదులపేర్లు తక్కువ సమయంలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది. అరుదైన ఘనత సాధించిన చిన్నారి యోగాశ్రితను తెలుగుదేశం అధినేత Chandrababu Naiduఅభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆశీర్వదించారు.
undefined
ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో హైదరాబాద్ కు చెందిన ఓ చిన్నారి ఇలాంటి రికార్డునే సొంతం చేసుకుంది. ఓ హైదరాబాద్ చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసెంతో తెలుసా. 20 నెలలు మాత్రమే. బాల భీముడిగా ఆ చిన్నారి 5 కిలోల బరువు ఎత్తి రికార్డ్ సాధించింది.
హైదరాబాదులో నివాసం ఉండే సందీప్ కూతురు దాసరి సాయి అలంకృత 5 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను అవలీలగా ఎత్తి అందర్నీ అబ్బురపరుస్తోంది అలంకృత.దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. ఏడాది వయసు ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్ వాటర్ బాటిల్ ను సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది.
అప్పటి నుంచి చిన్నారిలోని స్పెషల్ టాలెంట్ ను తల్లిదండ్రులు గమనిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో 4.2 కేజీల బరువున్న వాటర్ మిలన్ 17 నెలల వయసులో ఎత్తింది. ఇప్పుడు 20 నెలల వయసులో ఐదు కేజీల బరువు ఎత్తడం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.
కాగా, ఓ పదేళ్ల చిన్నారి 2020, అక్టోబర్ 12న కేవలం గంటలో ఏకంగా 30 వంటకాలు వండేసింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వింగ్ కమాండర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాజిత్ బాబు కూతురు శాన్వి ఎం ప్రాజిత్ గంటలో 30 కంటే ఎక్కువ వంటలు రెడీ చేయగలదు. ఊతప్ప, ఫ్రైడ్ రైస్, చికెన్ రోస్ట్ లాంటి వంటలన్నీ ఒకే చోట గంట సమయంలోనే తయారుచేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో స్థానం దక్కించుకుంది.
పిల్లల పేరుతో ఇలా ఓ రికార్డు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 ఆగస్టు 29న 10సంవత్సరాల 6నెలల 12రోజుల వయస్సున్న శాన్వి ‘తన ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ దీనిని ఆన్ లైన్‌లో పర్యవేక్షించింది. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు ఆమె పక్కనే ఉన్నారు. గంటలో శాన్వి 30 ఐటెంలు రెడీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ సందర్భంగా శాన్వి మాట్లాడుతూ.. ‘మా అమ్మ సాయంతోనే ఇది సాధించగలిగాను. స్టార్ చెఫ్ అయిన మా అమ్మ ఓ కుకరీ షోలో ఫైనల్ కంటెస్టెంట్‌గా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే ఇది సాధించగలిగాను’ అని తెలిపింది.శాన్వి చిల్డ్రన్ కుక్కరీ షోలలో కూడా చాలా సార్లు పాల్గొంది. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా నిర్వహిస్తూ.. రుచికరమైన వంటల రెసిపీలను ఫాలోవర్లతో పంచుకుంటుంది.