కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కు ఆంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం

Published : Feb 05, 2022, 09:35 AM IST
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కు ఆంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం

సారాంశం

విజయనగరం సంస్థాన వారసుడు, కేంద్ర మాజీ మంత్రికి అశోక్ గజపతి రాజు ఆంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం అందుకున్నారు. గజపతి రాజు దంపతులకు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు జగల్ శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందజేశారు.   

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు (former central  minister ashok gajapathi raju) కు ఆంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం లభించింది. తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానం నేటి వార‌సులు అయిన అశోక గ‌జ‌ప‌తి రాజు దంప‌తుల‌కు ఈ అవార్డును అందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా ఈ పుర‌స్కారం ప్ర‌క‌టించారు. ఈ అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ (gajal sriniavas), సురేఖ శ్రీనివాస్ (surekha srinivas)  విజ‌య‌న‌గ‌రంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా గ‌జ‌ల్ శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్ర‌ వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం ఆనందంగా ఉంద‌ని అన్నారు. వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగించిదని చెప్పారు. అనంత‌రం అశోక గజపతి మాట్లాడుతూ.. మాతృ భాష‌ జాతికి పునాది వంటిదని అన్నారు. దానిని కాపాడుకోవడం అందరి నైతిక బాధ్యత అని చెప్పారు. తెలుగు భాషా వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి