చంద్రబాబును ఉరి తీయాలి .. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 09, 2023, 08:52 PM IST
చంద్రబాబును ఉరి తీయాలి .. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉరితీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్లక్ష్యానికి గురయ్యాయని తోపుదుర్తి ధ్వజమెత్తారు.   

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఉరితీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలోనే కర్ణాటకలో అక్రమ ప్రాజెక్ట్‌లు కట్టారని, వీటికి ఆయన ఏనాడూ అడ్డు చెప్పలేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచినా చంద్రబాబు నోరెత్తలేదని.. అప్పర్ భద్రత ప్రాజెక్ట్‌కు నీటి కేటాయింపుకు 2011లోనే కోర్ట్ స్టే ఇచ్చిందని, 2017లో ఫారెస్ట్ క్లియరెన్స్ , రెండో విడత అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు అనుమతులు వచ్చాయని ప్రకాశ్ రెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్‌ నిర్లక్ష్యానికి గురయ్యాయని తోపుదుర్తి ఫైరయ్యారు. అప్రర్ భద్ర ప్రాజెక్ట్‌పై జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే వుందన్నారు. దీనిపై తమ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోందని, ఇప్పటికే సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నట్లు తెలిపారు. 

అంతకుముందు .. రాజధానిపై పచ్చమీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడుగడుగునా ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని.. చంద్రబాబు అమరావతి భూముల ధరలు పెంచుకుని ప్రయోజనం పొందాలనుకున్నారని సజ్జల ఆరోపించారు. సీఎంగా వుండి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యహరించారని.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశంతో ఆయన లబ్ధిపొందాలని చూస్తున్నారని రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని.. జగన్ ప్రజలు అవసరాలు తీర్చడంపైనే దృష్టి పెట్టారని సజ్జల తెలిపారు. 

Also REad: దయనీయ స్థితిలో టీడీపీ .. ఫోన్ ట్యాపింగ్ పథకం చంద్రబాబుదే, తెలుగుదేశం హయాంలో ఈ పనులే : సజ్జల వ్యాఖ్యలు

చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్‌లు చేశారని ఆయన ఆరోపించారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశాక చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదని సజ్జల దుయ్యబట్టారు. అప్పటి మంత్రి నారాయణతో కమిటీ వేసి వారంలో రాజధానిని ప్రకటించారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అమరావతిని బంగారు గుడ్లుపెట్టే బాతులా మార్చాలని అనుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు బినామీల పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని సజ్జల స్పష్టం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!