తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. 74యేళ్ల వృద్ధుడికి 20యేళ్ల జైలుశిక్ష..

Published : Oct 18, 2022, 06:41 AM IST
తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం.. 74యేళ్ల వృద్ధుడికి 20యేళ్ల జైలుశిక్ష..

సారాంశం

తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కీచక వృద్ధుడు. నేరం రుజువు కావడంతో అతడికి కోర్టు 20యేళ్ల జైలు శిక్ష విధించింది. 

విశాఖపట్నం : మునిమనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యంత హేయమైన పనికి దిగజారాడో నీచుడు. తమను నమ్మి ఇంట్లో ఉంచి వెడితే తొమ్మిదేళ్ల బాలిక మీద రెండుసార్లు అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి కె. రామ శ్రీనివాసరావు సోమవారం తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 

Pocso న్యాయస్థానం  ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అరిలోవ ప్రాంతానికి చెందిన  బాలిక (9) మూడో తరగతి చదువుతోంది. బాలిక తల్లి ఓ దుకాణంలో పనిచేసేది. రోజూ తన కుమార్తెను స్కూలు విడిచిన తరువాత అరిలోవ దుర్గా బజార్ ప్రాంతంలోని స్నేహితురాలు ఇంటివద్ద ఉంచేది. స్నేహితురాలి బంధువు  బాలయోగి (74) అక్కడే ఉండేవాడు. ఈ ఏడాది మార్చి 23న  బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి, ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళింది. 

నెమలి ఈకలు ఇస్తానని ఆశపెట్టి, బాలికపై లైంగిక దాడి..మరణించే వరకు జైలు శిక్ష..

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక ఇన్ఫెక్షన్తో బాధపడుతుందని తెలిపారు. దీనిపై బాలికను ప్రశ్నించడంతో బాలయోగి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు. అభం, శుభం తెలియని చిన్నారుల మీద ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ దర్జాగా తిరిగేస్తున్న నిందితులు ఇంకా చాలామందే ఉంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా అత్యంత జాగురూకతతతో ఉండాలి. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలోనే ఈ నెల 11న ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి జీవితకాలం కఠిన కారాగారశిక్ష విధిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కోర్టు న్యాయమూర్తి రజిని సోమవారం తీర్పునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నున్నకి చెందిన బాలిక (7) ఈ ఏడాది ఫిబ్రవరి 24న స్కూలుకు వెళ్లి వచ్చి ఇంటి వద్ద ఉంది. ఆసమయంలోనే ఆ ఇంటి సమీపంలో ఉంటున్న అనిల్ (30) ఆ బాలికకు నెమలీ ఈకలు ఇస్తానని ఆశ చూపి తాను పనిచేస్తున్న టెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అనిల్ చేసిన పనిని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె నున్న  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి.. కేసును దిశా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దిశా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా మరణించేవరకు జైలులో ఉండాలని కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా విధించారు. బాలిక  కుటుంబానికి రూ. ఐదు లక్షల నష్టపరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ను ఆదేశించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu