అనంతపురంలో దారుణం... ఇంట్లోకి చొరబడి మరీ వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Oct 05, 2021, 11:10 AM IST
అనంతపురంలో దారుణం... ఇంట్లోకి చొరబడి మరీ వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

సారాంశం

మహిళలకు రక్షణ కల్పిస్తూ కాపాడాల్సిన వాాడే కాటేయడానికి ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. ఇంట్లోకి చొరబడి మరీ వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ అరెస్టయ్యాడు.  

అనంతపురం: ఆపదలో వుంటే కాపాడాల్సిన పోలీసే ఓ వివాహితతో నీచంగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి ఆ శాఖకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించాడు. మహిళా రక్షణ కోసం రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతుంటే... అదే శాఖలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

దిశ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతరపురంలోని రుద్రంపేటలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు ఏఆర్ కానిస్టేబుల్ ఆదినారాయణ. 2005లో ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని పొందిన అతడు ప్రస్తుతం డిప్యుటేషన్‌పై సెబ్‌లో పనిచేస్తున్నాడు.  

అయితే అనంతపురంలోనే వుండే ఓ స్నేహితుడి ఇంటికి తరచూ వెళుతూ వుండేవాడు ఆదినారాయణ. ఈ క్రమంలో ఆ ఇంట్లో అద్దెకు వుంటున్న వివాహితపై అతడు కన్నేసాడు. సదరు మహిళతో మాటలు కలిపి పరిచయం పెంచుకోడానికి ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం ఉదయం స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఆదినారాయణ వివాహిత ఒంటరిగా వుండడాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా అదే సమయంలో ఆమె సోదరుడు రావడంతో పారిపోయాడు.  

read more  ఎనభై యేళ్ల వృద్ధురాలిపై 16యేళ్ల బాలుడి అత్యాచారం.. ఆరేళ్ల మనవరాలిపై యత్నం... బాలిక అరవడంతో..

బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో దిశ డీఎస్పీ శ్రీనివాసులు ఈ విషయాన్ని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప దృష్టికి తీసుకెళ్లారు. మహిళ ఫిర్యాదుపై జరిపిన విచారణ కానిస్టేబుల్ ఆదినారాయణ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తేలింది. దీంతో కానిస్టేబుల్ పై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేసి సోమవారం ఉదయం అరెస్టు చేసిన దిశ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్