కాకినాడ మేయర్‌పై అవిశ్వాసం: నేడు ప్రత్యేక సమావేశం, అందరి చూపు వారిపైనే

By narsimha lodeFirst Published Oct 5, 2021, 10:36 AM IST
Highlights

కాకినాడ మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ విషయమై ఇవాళ కాకినాడ కార్పోరేషన్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ అసమ్మతి కార్పోరేటర్లు స్వంత పార్టీకి చెందిన మేయర్ పై  అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. పార్టీ కార్పోరేటర్లకు టీడీపీ విప్ జారీ చేసింది.

కాకినాడ: కాకినాడ (kakinad mayor)మేయర్, డిప్యూటీ మేయర్ (deputy mayor)పై అవిశ్వాసంపై ఇవాళ కాకినాడ కార్పోరేషన్ (kakinada corporation) ప్రత్యేక సమావేశం జరగనుంది. అయితే  టీడీపీ (tdp)కార్పోరేటర్లకు ఆ పార్టీ విప్ (whip)జారీ చేసింది. కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం వ్యవహరాన్ని టీడీపీ, వైసీపీలు  (ysrcp)తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.

also read:ఒక్క తప్పుకే ప్రతిపక్షంలో పడ్డాం.. మళ్లీ జరగనివ్వం: రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు

2017లో కాకినాడ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పోరేటర్లలో ఒకరు రాజీనామా చేశారు. ముగ్గురు మరణించారు. దీంతో ప్రస్తుతం  44 మంది కార్పోరేటర్లున్నారు. కాకినాడ కార్పోరేషన్ లో టీడీపీకి 30 మంది కార్పోరేటర్లున్నారు.

వైసీపీకి 8 మంది సభ్యులున్నారు. బీజేపీకి ముగ్గురు కార్పోరేటర్లున్నారు. ముగ్గురు ఇండిపెండెంట్ సభ్యులున్నారు. అయితే ఇండిపెండెంట్ సభ్యుల్లో ఒకరు గతంలోనే టీడీపీకి మద్దతిచ్చారు.

టీడీపీకి ఉన్న 30 మంది కార్పోరేటర్లలో 21 మంది అసమ్మతి గళం విన్పిస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి ప్రస్తుత మేయర్ ను గద్దె దించాలని అసమ్మతి వర్గీయులు భావిస్తున్నారు. అయితే టీడీపీ నాయకత్వం పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ కు అనుకూలంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేసిన పత్రాలను టీడీపీ నేతలు జాయింట్ కలెక్టర్ కు సోమవారం నాడుఅందించారు.

కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ పై అసమ్మతికి సంబంధించి ఇవాళ ప్రత్యేకంగా కార్పోరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.పార్టీ విప్ ను ధిక్కరించి ఓటు చేసే కార్పోరేటర్లపై టీడీపీ నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో టీడీపీకి చెందిన అసమ్మతి కార్పోరేటర్లు ఎలాంటి వ్యూహాంతో ముందుకు వెళ్తారనేది ఉత్కంఠ నెలకొంది.

click me!