ఏపీ: 24 గంటల్లో 301 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,64,661కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Nov 04, 2021, 05:35 PM IST
ఏపీ: 24 గంటల్లో 301 మందికి పాజిటివ్.. రాష్ట్రంలో 20,64,661కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 301 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 367 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,830 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో కొత్తగా 301 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,64,661కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,388కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 367 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,46,443కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 36,373 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,96,52,114కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,830 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 3, చిత్తూరు 63, తూర్పుగోదావరి 53, గుంటూరు 24, కడప 16, కృష్ణ 39, కర్నూలు 4, నెల్లూరు 15, ప్రకాశం 7, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 41, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 26 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?