బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినట్టుగా డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. బాధిత కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడతామని డీజీపీ సవాంగ్ హామీ ఇచ్చారు. రమ్య కుటుంబసభ్యులు సోమవారం నాడు ఏపీ డీజీపీ సవాంగ్ ను కలిశారు.
గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్య కుటుంబన్ని మానసికంగా వేదిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హామీ ఇచ్చారు.
సోమవారం నాడు డిజిపిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రమ్య కుటుంబ సభ్యులుఘటనకు ముందు, అనంతరం జరిగిన పరిణామాలను వివరించిన కుటుంబ సభ్యులు.
ఘటన అనంతరం పోలీసులు సత్వరం స్పందించి ముద్దాయిని అరెస్ట్ చేశారని రమ్య కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు ఇంత వేగంగా స్పందించడం గతంలో ఎన్నడూ చూడలేదని రమ్య కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు. తమ కుటుంబం పైన కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసికంగా వేదిస్తున్నారు.రమ్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.
డబ్బులకు అమ్ముడుపోయామంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో భోజనం చేయలేక పోతున్నామన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు రమ్య పేరేంట్స్.
రమ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. కేసు దర్యాప్తును పోలీసులు వేగంగా పూర్తి చేశారని తెలిపిన రమ్య కుటుంబ సభ్యుల వాదనతో డీజీపీ ఏకీభవించారు. కేసు దర్యాప్తులో చురుకుగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ, సిబ్బందిని డిజిపి అభినందించారు.
రమ్య కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
రమ్య హత్య కేసు దర్యాప్తును కేవలం ఆరు రోజులోనే పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశామన్నారు.
కోర్టులో ట్రయల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి కఠిన శిక్షపడేలా న్యాయస్థానాన్ని కోరుతామని డీజీపీ సవాంగ్ చెప్పారు.మహిళ భద్రత, రక్షణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని డీజీపీ సవాంగ్ తెలిపారు.
మహిళల కోసం అనే సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్నివిధాలుగా రమ్య కుటుంబానికి సహాయసహకారాలు అందిస్తుందని ఆయన చెప్పారు.