రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Arun Kumar PFirst Published Mar 19, 2024, 10:04 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రంపచోడవరం ఒకటి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి కొనసాగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చిన వైసిపి రంపచోడవరంలో మాత్రం మళ్లీ ధనలక్ష్మినే బరిలోకి దింపింది. టిడిపి కూడా ఇక్కడ మహిళా అభ్యర్థినే పోటీలో నిలిపింది. ఇద్దరు మహిళల మద్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.  

రంపచోడవరం రాజకీయాలు :

2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రంపచోడవరం అసెంబ్లీ ఏర్పడింది. గిరిజన, ఆదివాసి ఓటర్లు ఎక్కువగా కలిగిన నియోజకవర్గం కావడంలో దీన్ని ఎస్టీ రిజర్వుడ్ గా కేటాయించారు. నియోజకవర్గ ఏర్పాటుతర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో రంపచోడవరం వైసిపికి కంచుకోటగా మారింది. 2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి వంతల రాజేశ్వరిని బరిలోకి దింపి గెలిపించుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగులపల్లి ధనలక్ష్మి గెలిచారు. ఇలా రెండుసార్లుగా రంపచోడవరంలో వైసిపి గెలుస్తూ వస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే 2024లో కూడా మహిళా అభ్యర్థులే రంపచోడవరంలో  పోటీ పడుతున్నారు.  

రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. మారేడుమిల్లి
2. దేవీపట్నం
3. వై.రాయవరం 
4. అడ్డతీగల
5. గంగవరం
6. రంపచోడవరం 
7. రాజవొమ్మంగి 
8. కూనవరం 
9. చింతూరు 
10. నెల్లిపాక 
11. వరరామచంద్రపురం 


రంపచోడవరం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,60,380
పురుషులు -  1,24,785
మహిళలు ‌-   1,35,585

రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరోసారి పోటీలో నిలిచారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చిన వైసిపి రంపచోడవరంలో మాత్రం అలాంటి ప్రయోగమేమీ చేయలేదు.  

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మిర్యాల శిరీషను బరిలోకి దింపుతోంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కొత్త అభ్యర్థిని రంపచోడవరం బరిలో దింపింది టిడిపి.   

రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,01,807 (77 శాతం)

వైసిపి -  నాగులపల్లి ధనలక్ష్మి  - 98,318 ఓట్లు  - 39,106 ఓట్ల మెజారిటీతో ఘన విజయం 

టిడిపి - వంతల రాజేశ్వరి ‌‌- 59,212 ‌- ఓటమి

రంపచోడవరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,14,978 (76 శాతం)

వైసిపి - వంతల రాజేశ్వరి - 52,156 (45 శాతం) ‌- 8,222 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - సీతంశెట్టి వెంకటేశ్వరరావు - 43,934 (38 శాతం) - ఓటమి 

click me!