విడదల రజిని: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

By Rajesh KarampooriFirst Published Mar 19, 2024, 7:26 AM IST
Highlights

Vidadala Rajini Biography: వందల కోట్ల ఆస్తి ఉన్న తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తిస్తుందని చెబుతారామే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. తన మాట తన దూకుడుతో ఎమ్యెల్యేగా గెలుపొంది.. అనతికాలంలోనే జగన్ క్యాబినేట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఆమెనే  విడదల రజిని. ఆమె వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..

Vidadala Rajini Biography: విడదల రజిని.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యార్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ అసలు లేదు. కానీ, అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఎమ్యెల్యేగా గెలుపొంది.. ఆ తరువాత మంత్రి అయ్యారు. ఇంతకీ రాకెట్ లా దూసుకపోతున్న విడదల రజిని ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?  ఆమె పొలిటికల్ ఎంట్రీ అసలు ఎలా జరిగింది? తెలుసుకుందాం.. 

బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం

1990 జూన్ 24న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు విడదల రజిని. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత అంటే 2011లో సికింద్రాబాద్ మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి.పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకలోని చిత్రదుర్గంలో జయమై ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బిఈ పట్టా అందుకున్న ఆమె ఆ తర్వాత ఎంబీఏ చేశారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆమె చదువు పూర్తి అయిన వెంటనే హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగా పని చేశారు. ఈ సమయంలో ఆమెకి విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరూ పిల్లలు. అమెరికాలో స్థిరపడ్డ వీరు అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి.. వందల మందికి ఉపాధి కల్పించారు. 

రాజకీయ ప్రవేశం. 

ఆర్థికంగా స్థిరపడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజా సేవ చేయాలని భావించారు.  ఆమె నిర్ణయాన్ని గౌరవించారు భర్త కుమారస్వామి. ఇలా 2014 ఎన్నికల సమయంలో చాలా మంది ఎన్నారైలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజిని కూడా సపోర్ట్ చేశారు. ఈ తరుణంలో విడుదల రజిని( 2014లో) ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె వి.ఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ను ప్రారంభించి పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. చిలకలూరిపేట ప్రజల్లో కలిసిపోయారు రజిని.

మరోవైపు.. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గంగా మాట్లాడే ఆమె సత్తాను గుర్తించిన ప్రతిపాటి పుల్లారావు 2017లో విశాఖపట్నంలోని మహానాడులో విడదల రజినితో మాట్లాడించారు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడదల రజిని అందర్ని అట్రాక్ట్ చేసింది. ’హైదరాబాదులోని సైబరాబాద్ లో మీరు నాటిన ఈ మొక్క’ అంటూ రజిని చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అందరి ద్రుష్టిని ఆకర్షించింది. ఇదే సభ వేదికపై నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిలను నరకాసురులు అంటూ అభివర్ణించింది విడదల రజిని. 

ఆనాడు ఆమె మాట్లాడిన మాటల వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీలోనే కాదు తెలుగింట రజిని ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇలా ఓవర్ నైట్ సార్ట్ గా మారిన  ఆమె ... తనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, తాను విఆర్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తనకు చిలకలూరిపేట నుంచి తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరరామె. కానీ, అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వాలనేనని క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ సరైన వేదికగా కాదని భావించిన ఆమె..  

వైసీపీలో చేరిక 

ఈ తరుణంలో రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు రజిని. పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పార్టీలో చేరాలని భావించారు. పాదయాత్ర సమయంలో విజయవాడలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె వైసిపి కండువా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టిడిపి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావుపై 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే.. 2022 ఏప్రిల్ 11 జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడతల రజిని తన మంత్రివర్గంలో తీసుకున్నారు.  వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు.

ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచితే సరిపోదని ప్రజల తోడు కూడా ఉండాలని నిరూపించిందమె.  బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవర త్నాలు, టిడిపి పై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఇంకా బలంగా తీసుకువెళ్లి తన గెలుపునకు బాటలు వేసుకోవడంలో రజిని వంద శాతం సఫలీకృతులయ్యారు. దీంతోపాటు రజనీ గెలుపునకు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యేగా అయి.. విడుదల రజిని చరిత్ర సృష్టించారు. ఆమె ఆర్యోగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత  గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేశారు. మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె వైద్య ఆరోగ్య రంగంలో రెండు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా చిలకలూరిపేట నుంచి పోటీ చేయనున్నారు. 

విడదల రజిని బయోడేటా

పేరు: విడదల రజిని
జననం: 24 జూన్ 1990
జన్మస్థలం: కొండాపూర్, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి: కుమారస్వామి
వెబ్‌సైటు: https://vidadalarajini.com/

click me!