కర్నూల్ లో దారుణం: భార్య, అత్తను హత్య చేసిన రమేష్

By narsimha lode  |  First Published Jun 11, 2023, 9:28 AM IST

కర్నూల్ జిల్లాలోని బాపురంలో  భార్య, అత్తను రమేష్ అనే వ్యక్తి  హత్య చేశాడు. భార్యపై అనుమానంతో  రమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.


 

కర్నూల్:జిల్లాలోని  కౌతాళం  మండలం  బాపురంలో దారుణం  చోటు  చేసుకుంది.   భార్య మహాలక్ష్మి,  అత్త హనుమంతమ్మను   భర్త రమేష్ హత్య  చేశాడు.రెండు  మాసాల  క్రితమే  కర్నాటకకు చెందిన   రమేష్ కు బాపురం గ్రామానికి  చెందిన   మహాలక్ష్మి అనే  యువతికి మధ్య   వివాహం   జరిగింది.  అయితే  భార్య మహాలక్ష్మిపై  భర్త అనుమానం పెంచుకున్నాడు.   శనివారంనాడు అర్ధరాత్రి  అత్తింటికి వచ్చిన  రమేష్  నిద్రపోతున్న   మహాలక్ష్మి, ఆమె తల్లి హనుమంతమ్మను  రమేష్ అత్యంత దారుణంగా హత్య  చేశాడు. నిందితుడు  రమేష్ ది  కర్ణాటకలోని  టెక్కలికోటకు  చెందినవాడు.    ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

Latest Videos

undefined

రెండు  తెలుగు రాష్ట్రాల్లో  వివాహేతర సంబంధం,  అనుమానం కారణంగా  హత్యలు  చోటు  చేసుకున్న ఘటనలు  గతంలో నమోదయ్యాయి,.సంగారెడ్డి జిల్లా జిన్నారం  మండలం ఊట్ల గ్రామానికి చెందిన  నర్సింహులు, యాదమ్మ భార్యాభర్తలు.  వీరిద్దరూ కూలీ పనులు చేసేవారు. కూలీ పనికి వెళ్లే సమయంలో  యాదమ్మకు  మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.  ఈ విషయమై ఈ ఏడాది మే  28వ తేదీన  భార్యాభర్తల మధ్య  గొడవ  జరిగింది. భార్యతో గొడవ పడిన తర్వాత  నర్సింహులు  నిద్రపోయాడు.  ఈ విషయాన్ని గమనించిన భార్య  భర్త నర్సింహులుపై  కిరోసిన్ పోసి  నిప్పంటించింది.  

మహబూబ్ నగర్ జిల్లాలో మంజుల అనే  మహిళ హత్య కేసులో  నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. వివాహేతర సంబంధమే  ఈ హత్యకు  కారణంగా  పోలీసులు తేల్చారు. చెన్నయ్య అనే వ్యక్తి  మంజులను హత్య చేశారు. తనతో కాదని  మరికొందరితో  మంజుల  వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని  చెన్నయ్య ఈ దారుణానికి పాల్పడ్డాడు.

click me!