నెల్లూరులో దారుణం... చర్చికి వెళ్ళిన వివాహితపై పాస్టర్ అత్యాచారం

Published : Jun 11, 2023, 07:39 AM ISTUpdated : Jun 11, 2023, 07:47 AM IST
నెల్లూరులో దారుణం... చర్చికి వెళ్ళిన వివాహితపై పాస్టర్ అత్యాచారం

సారాంశం

ప్రార్థన చేసుకోడానికి చర్చికి వెళ్లే మహిళపై పాస్టర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. 

నెల్లూరు : హైదరాబాద్ లో ఓ పూజారి అక్రమసంబంధం కలిగిన మహిళపై అతి దారుణంగా హతమార్చిన ఘటన మరిచిపోకముందే నెల్లూరులో ఓ పాస్టర్ పాడుపని చేసాడు. చర్చికి ప్రార్థన చేసుకోడానికి వచ్చే వివాహితపై కన్నేసిన పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపడటంతో బాధిత మహిళ మానానికి రూ.40 వేలు వెలకట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామానికి చెందిన ఓ వివాహిత ప్రార్థన చేసుకునేందుకు తరచూ చర్చికి వెళుతుండేది. ఈ క్రమంలోనే ఆమెకు పాస్టర్ తో పరిచయం పెరిగింది. అయితే సదరు పాస్టర్ బిడ్డలా చూడాల్సిన మహిళపైనే కన్నేసాడు. ఆమెను ఎలాగయినా అనుభవించాలనే పాడుబుద్దితో రగిలిపోతూ అదునుకోసం ఎదురుచూసాడు. 

ఇటీవల మహిళ ప్రార్థన చేసుకునేందుకు ఒంటరిగా చర్చికి రాగా ఇదే సరయిన సమయం అని పాదర్ భావించాడు. చిన్న పని వుందని మాయమాటలు చెప్పి వివాహితను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆమె తప్పించుకోడానికి ప్రయత్నించినా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 

Read More  అసహజ శృంగారం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు - తెలంగాణ ఐఏఎస్ అధికారిపై భార్య సంచలన ఆరోపణలు

బాధిత మహిళ చర్చి పాదర్ బెదిరింపులకు భయపడకుండా తనపై జరిగిన అఘాయిత్యం గురించి భర్తకు, కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో పాస్టర్ పై ఫిర్యాదు చేసారు. ఈ విషయం తెలిసిన పాస్టర్ ఓ అధికార పార్టీ నాయకుడితో రాజీకి ప్రయత్నించాడు. ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే రూ.40వేలు ఇవ్వడానికి పాస్టర్ సిద్దమంటూ సదరు నేత బాధిత కుటుంబాన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ వారు అందుకు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. 

పోలీసులు కూడా పాస్టర్ తో రాజీ కుదుర్చుకోవాలని చెబుతున్నారని బాధిత మహిళ కుటుంబం వాపోయింది. తమ ఆడబిడ్డపై జరిగిన అఘాయిత్యంపై న్యాయపోరాటం చేస్తామని... వెనక్కి తగ్గబోమని బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations