జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ... రామలింగరాజుకే ఆ బాధ్యతలు

By Arun Kumar PFirst Published Jul 9, 2021, 10:11 AM IST
Highlights

జగన్ సర్కార్ కు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాకినాడ విసిగా రామలింగరాజు తొలగింపుపై స్టే విధించింది న్యాయస్థానం. 

అమరావతి: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వైసిపి సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత మేలో కాకినాడ  జేఎన్టీయూ వైస్ చాన్స్ లర్ పదవినుండి రామలింగరాజును తొలగించింది వైసిపి ప్రభుత్వం. ఆ స్థానంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ను నియమించింది.  

అయితే తనను వైస్ చాన్సలర్ గా తొలగించడంతో రామలింగరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రామలింగరాజు తొలగింపుపై స్టే ఇచ్చింది. దీంతో తిరిగి రామలింగరాజు ను జేఎన్టీయూ వీసీగా నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

click me!