
ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారం పర్వాన్ని ప్రారంభించి నిత్యం జనంలోనే వుంటున్నాయి. మరోసారి అధికారాని అందుకోవాలని వైఎస్ జగన్.. ఈసారి పవర్ చేతికి రాకుంటే ఉనికికే ప్రమాదమని టీడీపీ, కింగ్ మేకర్ కావాలని జనసేనలు అన్ని రకాల అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నాయి. మధ్యలో పొత్తు పొడుపులు ఇలా ఏపీ రాజకీయమంతా హాట్ హాట్‌గా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది.
చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత రామచంద్ర యాదవ్ కొత్త పార్టీని ప్రకటించారు. గుంటూరు శివారులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ‘‘భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ)’’ని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో పార్టీని స్థాపించానని రామచంద్ర యాదవ్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే.. కొత్త రాజకీయ ప్రస్థానం జరగాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు.
అంతకుముందు రామచంద్రయాదవ్ వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం పేరుతో వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ సమావేశం ముగిసిన తర్వాత.. వాలంటీర్లతో చెత్తను ఎత్తించారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.