చంద్రబాబును దెబ్బ కొట్టిన రాజ్ నాథ్: జగన్ చేతికి అస్త్రం

First Published Jul 20, 2018, 6:26 PM IST
Highlights

 కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోకసభలో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ బంధం విడదీయలేనిదని, ఎప్పటికీ చంద్రబాబు తమ మిత్రుడేనని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోకసభలో శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ బంధం విడదీయలేనిదని, ఎప్పటికీ చంద్రబాబు తమ మిత్రుడేనని ఆయన వ్యాఖ్యానించారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు.

రాజ్ నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు, తమకు ప్రత్యేక హోదా వద్దని గతంలో టీడీపి ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని అలా పక్కన పెడితే, చంద్రబాబు ఇంకా బిజెపితో స్నేహం చేస్తూనే ఉన్నారని వైఎఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. 

వారి విమర్శలకు బలం చేకూర్చే విధంగా రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజ్ నాథ్ ఆ వ్యాఖ్యల ద్వారా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అస్త్రాన్ని అందించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

తమ పార్టీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడాన్ని కూడా వైసిపి టీడీపి, బిజెపి మధ్య లాలూచీగానే పరిగణిస్తోంది. తాజాగా, రాజ్ నాథ్ వ్యాఖ్యలతో చంద్రబాబుపై వైసిపి నేతలు మరింతగా విరుచుకుపడే అవకాశం ఉంది. 

"

click me!