రాజంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 18, 2024, 7:41 PM IST
Highlights

కాపు, శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీలు రాజంపేటలో ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టీ సుండుపల్లి మండలాలున్నాయి. రాజంపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,191 మంది. వీరిలో పురుషులు 1,15,751 మంది.. మహిళలు 1,21,430 మంది. ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, సీపీఐ అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ తరపున బత్యాల చెంగల్రాయుడు, నరహరిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

కడపకు కూతవేటు దూరంలో వుండే రాజంపేటలో రాజకీయంగా హాట్ హాట్‌గా మారింది. దట్టమైన నల్లమల అడవులతో పాటు అపారమైన ఖనిజ సంపదకు , ప్రకృతి రమణీయతకు ఈ నియోజకవర్గం కేంద్రం. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజంపేట కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, సీపీఐ అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. 

రాజంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ... కాపులదే ఆధిపత్యం :

కాంగ్రెస్ సీనియర్ నేత, మహిళా నేత ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీడీపీ నేత పసుపులేటి బ్రహ్మయ్య ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కాపు, శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీలు రాజంపేటలో ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టీ సుండుపల్లి మండలాలున్నాయి. రాజంపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,191 మంది. వీరిలో పురుషులు 1,15,751 మంది.. మహిళలు 1,21,430 మంది. 

రాజంపేట శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేడా మల్లిఖార్జున రెడ్డికి 95,266 ఓట్లు.. బత్యాల చెంగల్రాయుడు 59,994 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ అభ్యర్ధి 35,272 ఓట్ల మెజారిటీతో రాజంపేటలో విజయం సాధించారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు.

మరోవైపు.. టీడీపీకి కూడా రాజంపేటలో బలమైన ఓటు బ్యాంక్ వుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఈ సీటును పవన్ కళ్యాణ్ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా వుండటమే అందుకు కారణం. అయితే టీడీపీ తరపున బత్యాల చెంగల్రాయుడు, నరహరిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజంపేటను జనసేనకు కేటాయిస్తే.. చంద్రబాబు వీరిని ఎలా బుజ్జగిస్తారో చూడాలి. 


 

click me!