మొహమాట పడితే.....

First Published Sep 23, 2017, 2:55 PM IST
Highlights
  • నిన్నటి వరకూ ఆయన నిజంగానే ఓ బాహుబలే.
  • సినిమాలో నటించింది ఎవరైనా సినిమాకు దర్శకత్వం వహించింది మాత్రం రాజమౌళే.
  • అందుకనే సినిమా రిలీజ్ తర్వాత సాధించిన ఘనవిజయంతో ప్రపంచం మొత్తం రాజమౌళిని బాహుబలిగా కీర్తిస్తోంది.
  • ఆకాశమంతెత్తున ఎదిగిన రాజమౌళి గ్రాఫ్ ఒక్కసారిగా అదఃపాతాళానికి పడిపోతోందేమో అనిపిస్తోంది.

నిన్నటి వరకూ ఆయన నిజంగానే ఓ బాహుబలే. సినిమాలో నటించింది ఎవరైనా సినిమాకు దర్శకత్వం వహించింది మాత్రం రాజమౌళే. అందుకనే సినిమా రిలీజ్ తర్వాత సాధించిన ఘనవిజయంతో ప్రపంచం మొత్తం రాజమౌళిని బాహుబలిగా కీర్తిస్తోంది. ఆకాశమంతెత్తున ఎదిగిన రాజమౌళి గ్రాఫ్ ఒక్కసారిగా అదఃపాతాళానికి పడిపోతోందేమో అనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం మాత్రం చంద్రబాబునాయుడే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో రాజమౌళి స్వయంకృతం కూడా ఉంది.

ఎప్పుడైతే రాజధాని డిజైన్ల విషయంలో చర్చించేందుకు రాజమౌళి అంగీకరించారో అప్పటి నుండి ప్రతిపక్షాలు చంద్రబాబుపై మండిపడుతూనే  రాజమౌళిని ఎద్దేవా చేయటం మొదలుపెట్టాయి. భ్రమల్లో బ్రతకటానికే ఎక్కువగా ఇష్టపడుతున్న చంద్రబాబు అమరావతి డిజైన్లపై సలహాలు, సూచనల గురించి రాజమౌళిని సంప్రదిస్తే అసలు ఆయనెందుకు అంగీకరించాలి. బాహుబలి సినిమాలో రాజమౌళి వేసిన సెట్టింగులను చూసి మనసు పారేసుకున్న చంద్రబాబు వాటిపై మోజు పెంచుకున్నారు. రేపు అంతకన్నా బ్రహ్మాండగా మరో దర్శకుడు సెట్టింగులేస్తే రాజమౌళిని వదిలేసి చంద్రబాబు కొత్త దర్శకుడి వెంట పడతాడనటంలో ఎవరికీ అనుమానాల్లేవు.

ఈ విషయం రాజమౌళికి తెలీకుండా ఉంటుందని అనుకునేందుకూ లేదు. మొదట్లోనే చంద్రబాబు ఆఫర్ ను రాజమౌళి తిరస్కరించారు. అదేమాట మీదుంటే సరిపోయేది. ఇష్టం లేకపోయినా రాజమౌళి చంద్రబాబు చెప్పినట్లు ఒప్పుకున్నారంటే అందుకు ఆయన మొహమాటమే కారణంగా తెలుస్తోంది. రేపేదైనా తేడా వస్తే  చంద్రబాబు సేఫే. మరి,  రాజమౌళి పరిస్ధితేంటి?  

click me!