పవన్‌కు జగన్ సర్కార్ మరో షాక్: బహిరంగ సభకూ మెలిక, వేదికను మార్చుకోవాలన్న పోలీసులు

By Siva KodatiFirst Published Oct 1, 2021, 6:45 PM IST
Highlights

రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు. సభా వేదికను మార్చుకోవాలని సూచించినట్లు అడిషనల్ ఎస్పీ చెప్పారు. బాలాజీపేట సెంటర్‌లో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు

రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి లేదని రాజమండ్రి అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు. సభా వేదికను మార్చుకోవాలని సూచించినట్లు అడిషనల్ ఎస్పీ చెప్పారు. బాలాజీపేట సెంటర్‌లో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు అనుమతి లేని కారణంగా ధవళేశ్వరం  కాటన్ బ్యారేజ్‌పై కార్యక్రమాన్ని రద్దు చేసింది జనసేన పార్టీ.

ALso Read:ఇరిగేషన్ శాఖ అనుమతి నిరాకరణ: జనసేనాని శ్రమదానం వేదిక మార్పు, ఎక్కడంటే?

శ్రమదాన కార్యక్రమానికి ముందు సభ జరగబోతోంది. పవన్ కల్యాణ్ ఈ సభలో ప్రసంగించే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో ముందుగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై గుంతలు పూడ్చి శ్రమదాన కార్యక్రమం తలపెట్ట దలచుకున్నారు. మరోవైపు సాంకేతిక కారణాల దృష్ట్యా అనుమతి లేకపోవడంతో దానిని హుకుంపేట రోడ్‌కు మార్చారు జనసేన నేతలు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే శ్రమదాన కార్యక్రమం వుందో ఆ ప్రాంతంలో సభ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ మేరకు రాజమండ్రి అర్బన్ పోలీసులు ప్రకటన చేశారు. బహిరంగ సభకు వేదిక మార్చుకోవాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. 

click me!