ఇరిగేషన్ శాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని జగన్ కోరారు.
అమరావతి:కృష్ణా నదిపై బ్యారేజీల (krishna river) నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇరిగేషన్ (ap cm Ys jagan) అధికారులను ఆదేశించారు.శుక్రవారంనాడు తన క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష (review on irrigation department) నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టుల పురోగతిని సీఎం అధికారులను అడిగి తెలుసుకొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వెంటనే రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు నీరిస్తామని అధికారులు జగన్ దృస్టికి తీసుకొచ్చారు
మరో వైపు వచ్చే ఏడాది ఆగష్టు నాటికి అవుకు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి నీరందిస్తామని అధికారులు చెప్పారు.వంశధార స్టేజ్ 2 పనులను నిర్థీణ సమయంలోపుగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.ఈ విషయమై ఒడిశా రాష్ట్రంతో చర్చించాలని ఆయన అధికారులను ఆదేశించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువలను వెంటనే మరమ్మత్తులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.