చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసు: జక్కంపూడి రాజాకి మార్గాని భరత్ కౌంటర్

By narsimha lode  |  First Published Sep 21, 2021, 12:01 PM IST

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన విమర్శలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన విమర్శలకు భరత్ సమాధానం ఇచ్చారు. సీబీఐ మాజీ జేడీతో భరత్ సెల్ఫీ దిగడాన్ని రాజా తప్పుబట్టారు.


రాజమండ్రి:  చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసునని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(Jakkampudi Raja)కు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్(Margani Bharath) కౌంటర్ ఇచ్చారు.రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పై రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలకు ఎంపీ భరత్ మంగళవారం నాడు కౌంటర్ ఇచ్చారు.నేను ఎక్కువగా పనిచేస్తున్నాని ఎంపీ భరత్ చెప్పారు. ఇలా ఎక్కువ పనిచేయడంతో ఆయనకు  బాధ కలుగుతోందో ఏమోనని ఆయన సెటైర్లు వేశారు.
రాజమండ్రిలో ఎన్నో అభివృద్ది పనులు చేశానని ఎంపీ భరత్ చెప్పారు. తాను నిస్వార్ధంగానే పనిచేస్తున్నానని భరత్ చెప్పారు.

Latest Videos

also read:జక్కంపూడి Vs మార్గాని: రాజమండ్రి ఎంపీపై రాజా ఫైర్

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీ దిగడాన్ని ఎమ్మెల్యే రాజా తప్పుబట్టారు. ఈ అంశాన్ని అసరాగా చేసుకొని రాజా ఎంపీ భరత్ పై సోమవారం నాడు విమర్శలు చేశారు. ఈ విమర్శలకు భరత్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు.ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శలు చేసుకోవడం ప్రస్తుతం తూర్పు గోదావరి వైసీపీ లో చర్చకు దారితీసింది.

నీలాగే నేను కూడా కిడ్ గా ప్రవర్తిస్తే నీకు నాకు తేడా ఉండదని  చురకలంటించారు  ఎంపీ మార్గాని భరత్.పార్టీ లక్ష్మణణ గీతను దాటను.. నువ్వు నీ పరిధిలో ఉండాలని ఎంపీ భరత్  ఎమ్మెల్యే జక్కంపూడికి సూచించారు.కుమ్మక్కు రాజకీయాలు తనకు తెలియవని ఆయన చెప్పారు.

click me!