Paramedical Student Murder : వైద్య విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. పదినెలలకే గొంతుకోసి దారుణ హత్య..

By AN TeluguFirst Published Sep 21, 2021, 11:06 AM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే సుధారాణికి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు  మండలం యాళ్లగూడేనికి చెందిన 21 యేళ్ల మానేపల్లి గంగరాజుతో పరిచయం ఏర్పడింది. 

ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకుని భార్యనే కడతేర్చాడు ఓ కసాయి భర్త. పెళ్లైన పది నెలలకే ఆమెపై ఘాతుకానికి ఒడిగట్టాడు. తూర్పు గోదావరి జిల్లా (East Godavari) కాకినాడ(Kakinada)లో వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాపురంలో కలతలు, మనస్పర్థల కారణంగా ఓ పారా మెడికల్ విద్యార్థిని (Paramedical Student)ని అత్యంత దారుణంగా హతమార్చాడు భర్త. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19) ప్రస్తుతం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎనస్తీషియా ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే సుధారాణికి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు  మండలం యాళ్లగూడేనికి చెందిన 21 యేళ్ల మానేపల్లి గంగరాజుతో పరిచయం ఏర్పడింది. 

ఇది కాస్తా కొద్ది రోజులకు .. ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. అలా కొద్ది రోజులు గడిపిన తరువాత పది నెలల కిందట వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత సుధారాణి హాస్టల్లో ఉంటూ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో చదువుకుంటోంది. గంగరాజు ఊర్లో ఉంటున్నాడు.

ప్రేమిస్తున్నానని నమ్మించి.. లక్షలు కాజేసి.. ఆమె కారుతోనే ఉాడాయించి..!

ఈ నేపథ్యంలో.. ఈ నెల 17న గంగరాజు కాకినాడకు వచ్చాడు. దీంతో గంగరాజు, సుధారాణిలు ఏకాంతంగా గడపడం కోసం కాకినాడలోని స్థానిక కోకిల సెంటర్లోని ద్వారకా లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది వాగ్వాదానికి దారి తీసింది. దీంతో గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో తన భార్య సుధారాణి మీద దాడి చేశాడు.

విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తరువాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయి సోమవారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో కాకినాడ ఎస్ డీపీవో వి. భీమారావు, టూటౌన్ ఎస్ఐ పి. ఈశ్వరుడు సోమవారం రాత్రి సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్ం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, కారణమాల మీద ఆరా తీస్తున్నారు.

click me!