విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ ను సీఎం జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు. ఆజాదీ కా ఉత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వాణిజ్య ఉత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పుస్తకాన్ని జగన్ ప్రారంభించారు.
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ఉత్సవం -2021 కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan)మంగళవారం నాడు విజయవాడలో ప్రారంభించారు. వాణిజ్య ఉత్సవ్ (vanijya utsav)లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్ సందర్శించారు.రెండు రోజుల పాటు ఈ వాణిజ్య ఉత్సవం కొనసాగుతుంది. వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహకాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు రెట్టింపు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఫార్మా ఎలక్ట్రానిక్న్, పుడ్ ప్రాసెసింగ్ , టెక్స్ టైల్స్ ఎగుమతులకు అవకాశం ఉంది.
ఎక్స్‌పోర్ట్ కాన్‌క్లేవ్ ద్వారా ఎగుమతిదారులకు కావాల్సిన సమాచారం అందిస్తామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.వాణిజ్యంతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా పోటీ పడే సత్తా రాష్ట్రానికి ఉందన్నారు మేకపాటి గౌతం రెడ్డి.వాణిజ్యం పెంపునకు , మౌళిక వసతుల కల్పనలో ఏపీ ముందుంటుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం తయారు చేసిన వెబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య ఎగుమతులపై ప్రణాళికను సీఎం జగన్ ఈ సందర్భంగా విడుదల చేశారు.