ఆంధ్రప్రదేశ్, తాడికొండలో వడగళ్ల వాన జోరుగా కురుస్తోంది. దీంతో అమరావతి - గుంటూరు రహదారిపై చింత చెట్టు కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఆంధ్రప్రదేశ్, తాడికొండలో వడగళ్ల వాన జోరుగా కురుస్తోంది. దీంతో అమరావతి - గుంటూరు రహదారిపై చింత చెట్టు కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
undefined
కాగా సోమవారంనాడు రాబోయే నాలుగైదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతో పాటు దక్షిణ కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోను 1,2 ప్రదేశాల్లో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెల 14వ తేదీన తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇంటీరియర్ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకన్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.