కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

By Siva KodatiFirst Published Aug 30, 2020, 8:04 PM IST
Highlights

పశ్చిమ మధ్యప్రదేశ్, దానిని అనుకుని వున్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది

పశ్చిమ మధ్యప్రదేశ్, దానిని అనుకుని వున్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం వుంది.

Latest Videos

ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు చాలా చోట్ల కురిసే అవకాశం వుంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం వుంది.రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

click me!