టికెట్ లేకుండా రైలెక్కిన వారిపై కొరడా .. ఒక్క రోజులో 1,973 కేసులు, రూ.13.27 లక్షల జరిమానా

Siva Kodati |  
Published : Dec 17, 2023, 05:26 PM ISTUpdated : Dec 17, 2023, 05:35 PM IST
టికెట్ లేకుండా రైలెక్కిన వారిపై కొరడా .. ఒక్క రోజులో 1,973 కేసులు, రూ.13.27 లక్షల జరిమానా

సారాంశం

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 100 టీమ్స్ రంగంలోకి దిగి.. విజయవాడ నుంచి రాజమండ్రి రూట్‌లో తిరిగే 63 రైళ్లను తనిఖీ చేశాయి. ఈ తనిఖీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వందల మంది పట్టుబడ్డారు. 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు మరోసారి చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. దాదాపు 100 టీమ్స్ రంగంలోకి దిగి.. విజయవాడ నుంచి రాజమండ్రి రూట్‌లో తిరిగే 63 రైళ్లను తనిఖీ చేశాయి. ఈ తనిఖీలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వందల మంది పట్టుబడ్డారు. అలాగే 1973 కేసులు పెట్టి.. రూ.13.27 లక్షల పెనాల్టీ వసూలు చేశారు. 978 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేయగా.. 17 మంది అనుమతి లేకుండా పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. 

ఇకపోతే.. విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 18 నుంచి ఏపీ మీదుగా వెళ్తున్న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పలు రైళ్లు పూర్తిగాను, కొన్నింటినీ పాక్షికంగాను రద్దు చేసినట్లు తెలిపింది. 

పూర్తిగా రద్దయిన రైళ్లు:

  • మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220)
  • విజయవాడ–విశాఖపట్నం (22702/22701)
  • బిట్రగుంట–విజయవా­డ  (07977/07978)
  • బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238)
  • విజయవాడ–తెనాలి (07279/07575)
  • విజయవాడ–ఒంగోలు (07576/07500)
  • విజయవాడ–గూడూరు  (12744/12743)
  • గుంటూరు–విశాఖపట్నం (17239/17240) 

దారి మళ్లించిన రైళ్లు :

  • యర్నాకుళం–పాట్నా (22643) .. (ఈ నెల 18 నుంచి 25 వరకు )
  • భావ్‌నగర్‌–కాకినాడ పోర్టు (12756) .. (ఈ నెల 23 నుంచి 30 వరకు)
  • బెంగళూరు–గౌహతి (12509) .. (ఈ నెల 20, 22, 27, 29 వరకు)
  • ఛత్రపతి శివాజీ టెర్మినస్‌–భువనేశ్వర్‌ (11019).. (ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 వరకు)
  • ధన్‌బాద్‌–అలెప్పి (13351) .. (ఈ నెల 18 నుంచి 31 వరకు )
  • హతియా–బెంగళూరు (18637) .. (ఈ నెల 23, 30 తేదీల్లో)
  • హతియా–బెంగళూరు (12835) .. (ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో)
  • టాటా–బెంగళూరు (12889) .. (ఈ నెల 22, 29 తేదీలలో)
  • టాటా–యశ్వంత్‌పూర్‌ (18111) (ఈ నెల 21, 28 తేదీల్లో )
  • హతియా–యర్నాకులం (22837) .. (ఈ నెల 18, 25 తేదీల్లో )

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్