
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి చెల్లబోయిన వేణు తీవ్ర విమర్శలు చేశారు. యువగళం పాదయాత్రను క్యాట్ వాక్ తో పోల్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ లావు తగ్గడానికి ఈ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అసలెందుకు ఈ పాదయాత్ర చేపట్టారో తెలియడం లేదని అన్నారు.
లోకేష్ చేస్తున్నది క్యాట్ వాక్ అని మంత్రి చెల్లుబోయిన వేణు ఎద్దేవా చేశారు. సాధారణంగా ప్రజల గోడును వినేందుకు పాదయాత్ర చేస్తుంటారని అన్నారు. కానీ నారా లోకేష్ ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారో కనీసం ఆయనకు కూడా తెలియదని విమర్శించారు. ఈ యువగళం పాదయాత్ర చేపట్టకూడదని, దీని వల్ల ఎలాంటి లాభమూ లేదని టీడీపీకి చెందిన నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గతంలోనే చెప్పారని అన్నారు. కానీ ఈ విషయాన్ని లోకేష్ పట్టించుకోవడం లేదని తెలిపారు.
మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..
ఓ ఎర్ర బుక్కు రాస్తున్నానని లోకేష్ పదే పదే చెబుతున్నారని మంత్రి అన్నారు. కానీ అసలు పాదయాత్రకే విలువ లేదని, ఆ ఎర్ర బుక్కు రాసుకొని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆ బుక్కు ఎందకూ పనికి రాదని ఎద్దేవా చేశారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, సెల్పీలు తీసుకోవడం తప్ప లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రకు పెద్ద సీన్ లేదని విమర్శలు చేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకుడు మారాలని అన్నారు. లేకపోతే జనం పట్టించుకోరని అన్నారు.
Three Capitals : మూడు రాజధానుల ప్రకటనకు నాలుగేళ్ళు ... సరిగ్గా ఇదే రోజు అమరావతి ఆశలు గల్లంతు
ఆరు నూరు అయినా ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని మంత్రి చెల్లుబోయిన వేణు ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు తమ ప్రభుత్వ విధానాల పట్ల సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వమే న్యాయం చేస్తుందని తెలిపారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.