అమానుషం... అప్పు తీర్చమన్న వృద్దురాలు...కుక్కల్ని వదిలిన రైల్వే ఉద్యోగి (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 07, 2020, 09:33 PM IST
అమానుషం... అప్పు తీర్చమన్న వృద్దురాలు...కుక్కల్ని వదిలిన రైల్వే ఉద్యోగి (వీడియో)

సారాంశం

ఇచ్చిన అప్పు తీర్చమని అడిగినందుకు ఓ వృద్దురాలిపైకి కుక్కలను వదిలాడు ఓ రైల్వే ఉద్యోగి

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అమానుషం ఘటన చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తీర్చమని అడిగినందుకు ఓ వృద్దురాలిపైకి కుక్కలను వదిలాడు ఓ రైల్వే ఉద్యోగి. అంతేకాకుండా వృద్దురాలిపై దంపతులు బౌతిక దాడికి కూడా యత్నించారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వృద్దురాలు రైల్వే ఉద్యోగి ఇంటిఎదుటే రోదిస్తూ కూర్చుంది. 

తాను దాచుకున్న డబ్బును తెలిసిన వారని అప్పు ఇచ్చినట్లు బాధిత వృద్దురాలు రామావత్ చంపల్లి (70) తెలిపింది. అనారోగ్యం కారణంతో తన డబ్బులు తిరిగివ్వాలని అడిగితే డబ్బులు ఇవ్వకపోగా దాడికి పాల్పడినట్లు వృద్దురాలు తెలిపారు. 

వీడియో

"

దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రైల్వే ఉద్యోగి రంజిత్ నాయక్ ను విచారించారు. వృద్దురాలిపై నిజంగానే కుక్కలను వదలడం, డబ్బులు తీసుకుని ఇవ్వకుండా వేదించినట్లు తేలితే అతడిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?