కృష్ణపట్టణం పోర్టు వద్ద చివరిసారిగా సిగ్నల్: 12 మంది మత్స్యకారుల కోసం గాలింపు

By narsimha lode  |  First Published Jul 19, 2021, 8:13 PM IST

చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్స్యకారుల బోటు నుండి సిగ్నల్స్ ను అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా కృష్ణ పట్టణం వద్ద ఏపీ, తమిళనాడు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు  చెందిన 12 మంది మత్స్యకారులు ఉపాధికోసం తమిళనాడుకు వెళ్లారు.
 



శ్రీకాకుళం: చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్య్సకారులు ప్రయాణించిన బోటు నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం పోర్టు సమీపంలో  చివరిసారిగా సిగ్నల్స్ ను అధికారులు గుర్తించారు.  మత్స్యకారుల కోసం ఏపీ, తమిళనాడు అధికారులు  గాలింపు చర్యలు చేపట్టారు.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం చెన్నైలోని ఫిషింగ్ హర్బర్  నుండి  ఈ నెల 7న  బోటులో వేటకు వెళ్లారు.ఈ నెల 16వ తేదీ వరకు కుటుంబసభ్యులతో వారంతా టచ్ లో ఉన్నారు. 

also read:చేపల వేటకు వెళ్లిన 12 మంది మత్య్సకారుల ఆచూకీ గల్లంతు: కన్నీరుమున్నీరుతున్న బాధిత కుటుంబాలు

Latest Videos

అయితే ఆ తర్వాతి నుండి ఎవరూ కూడ ఫ్యామిలీ మెంబర్స్ తో అందుబాటులో లేరు. ఈ విషయమై మంత్రి అప్పలరాజుతో బాధిత కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో మత్స్యకారుల కోసం ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి.  ఏపీ నుండి నేవీ హెలికాప్టర్,  తమిళనాడు నుండి డోర్నియర్  విమానాల్లో మత్స్యకారుల కోసం గాలింపు  చర్యలు చేపట్టారు. కృష్ణపట్టణం పోర్టు సమీపంలో  గల్లంతైన వారి నుండి  చివరిసారిగా సిగ్నల్ వచ్చినట్టుగా గుర్తించడంతో ఈ ప్రాంతంలో గాలిస్తున్నారు.
 

click me!