ఏపీ ఏంపీల్లో నెంబర్ వన్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు

Published : Dec 21, 2020, 08:12 AM ISTUpdated : Dec 21, 2020, 08:13 AM IST
ఏపీ ఏంపీల్లో నెంబర్ వన్ ఎంపీ రఘురామకృష్ణమ రాజు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఎంపీగా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు నిలిచారు. ఓవరాల్ గా ఆయనకు 40వ ర్యాంక్ వచ్చింది. రఘురామకృష్ణమ రాజు వైసీపీపై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే.

అమరావతి: దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ర్యాంకులువిడుదలయ్యాయి. ఓవరాల్ గా రఘురామకు 40వ ర్యాంకు వచ్చింది. దీంతో రఘురామకృష్ణమ రాజు ఏపీలో నెంబర్ వన్ ఎంపీగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన నెంబర్ వన్ ఎంపీగా ఎంపికయ్యారు.ర్యాంకుల జాబితాలో మిథున్ రెడ్డి, నందిగం, బాలశౌరికి స్థానాలు దక్కాయి. 

దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ప్రముఖ మీడియా వేదిక 'పార్లమెంటరీ బిజినెస్' ర్యాంకులు కేటాయించింది. తాజాగా వెల్లడించిన ఈ ర్యాంకుల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ ఎంపీలందరిలోనూ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా ఆయన పనితీరుకు గాను 40వ ర్యాంకు లభించింది. లోక్ సభలో కనబర్చిన ప్రదర్శన ప్రకారం ఆయనకు 53వ ర్యాంకు, నియోజకవర్గం వారీగా చూస్తే 72వ ర్యాంకు లభించాయి.

ఇక, పార్లమెంటరీ బిజినెస్ ర్యాంకుల్లో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని బాలశౌరికి కూడా ర్యాంకులు లభించాయి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మిథున్ రెడ్డి 187, బాలశౌరి 237, నందిగం సురేశ్ 379వ ర్యాంకులో నిలిచారు.

రఘురామకృష్ణమ రాజు గత కొంత కాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. నర్సాపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu