సెక్షన్ 124ఏను రద్దు చేయండి.. ఏపీ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లకు రఘురామ లేఖ

By Siva KodatiFirst Published Jun 8, 2021, 3:52 PM IST
Highlights

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మరింత స్పీడు పెంచారు వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్, సహచర ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు లేఖ రాసిన రఘురామ... తనపై వైసీపీ ప్రభుత్వం ఎలా కక్షగట్టిందో వివరించారు

బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మరింత స్పీడు పెంచారు వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్, సహచర ఎంపీలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు లేఖ రాసిన రఘురామ... తనపై వైసీపీ ప్రభుత్వం ఎలా కక్షగట్టిందో వివరించారు. జగన్ బెయిల్ రద్దు చేసిన తర్వాతే తనను సీఐడీ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని, కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ వెల్లడించారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. త్వరలో జరగనున్న గవర్నర్ల సదస్సు నేపథ్యంలో వ్యూహాత్మకంగానే ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం. సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని రఘురామ గవర్నర్లును కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలల్లో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి రఘురామ తీసుకెళ్లారు. 

Also Read:నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు: ఏపీ సీఐడీ అసంతృప్తి

ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేస్తే... సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని తనపై అక్రమ కేసులు బనాయించేలా చేశారని రఘురామ పేర్కొన్నారు. ఏపీ సీబీసీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించారని లేఖలో పేర్కొన్నారు. సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో తనను చిత్రహింసలు పెట్టారని రఘురామ గవర్నర్ల దృష్టికి తీసుకువచ్చారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడమే కాకా.. హింసించారని ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు రఘురామ పేర్కొన్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో ఈ అంశాన్ని లెవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు రఘురామ విజ్ఞప్తి చేశారు.

click me!