ఆర్మీ ఆస్పత్రి కమాండర్ కు రఘురామ లేఖ: గుంటూరు అర్బన్ ఎస్పీకి కోర్టు ధిక్కార నోటీసులు

By telugu teamFirst Published May 24, 2021, 8:40 PM IST
Highlights

తనకు మరిన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స అందించాలని వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆర్మీ కమాండర్ కు లేఖ రాశారు కాగా, గుంటూరు అర్బన్ ఎస్పీకి ఆయన తరఫు న్యాయవాది కోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చారు.

అమరావతి: గుంటూరు అర్బన్ ఎస్పీకి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృ,ష్ణం రాజు తరపు న్యాయవాది దుర్గాప్రసాద్ కోర్టు ధిక్కార నోటీసులు పంపించారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన వెంటనే రఘురామను తీసుకు రావాలని ఎస్కార్ట్ ను ఆదేశించినట్లు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. 

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రఘురామ కృష్ణం రాజు విడుదలైనట్లేనని ఆయన అన్నారు. విడుదలైన 10 రోజుల లోపల బాండ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రఘురామ కృష్ణం రాజును తీసుకురావాలని ఎస్కార్ట్ ను పంపించారని, అలా ఆదేశించడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు 

అందుకే నోటీసులు ఇస్తున్నట్లు దుర్గాప్రసాద్ చెప్పారు. హైదరాబాద్ నుంచి గుంటూరు అర్బన్ ఎస్పీకి దుర్గాప్రసాద్ నోటీసులు పంపించారు. 

ఇదిలావుంటే, ఆర్మీ ఆస్పత్రికి రఘురామ కృష్ణమ రాజు లేఖ రాసినట్లు తెలుస్తోంది. పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ వాడుతున్నట్లు ఆయన తెలిపారు. తన కాలి నొప్పి ఇంకా తగ్గలేదని ఆయన చెప్పారు. బీపీలో కూడా హెచ్చ తగ్గులు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. నోరు కూడా తరుచుగుా పొడారిపోతోందని ఆయన చెప్పారు.

రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.  అయినా మీరు డిశ్చార్జీ చేయాలనుకుంటే, డిశ్చార్జీ సమ్మరీలో తన ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి వద్ద ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. 

రఘురామ కృష్ణం రాజు విడుదలకు మరో నాలుగు రోజులు వేచి ఉండక తప్పదని రఘురామ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు కోర్టు ఆదేశాలతో పూచికత్తు పిటిషన్ ను ట్రయల్ కోర్టులో వేశామని ఆయన సోమవారం మీడియాతో చెప్పారు. డిశ్చార్జ సమ్మరీ కావానలి న్యాయమూర్తి అడిగారని ఆయన చెప్పారు. 

అయితే, రఘురామ కృష్ణం రాజు డిశ్చార్జీ కావడానికి నాలుగు రోజులు పడుుతుందని ఆయన చెప్పారు నాలుగు రోజుల తర్వాత మరోసారి సిఐడి కోర్టులు ష్యూరిటీ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. అప్పటివరకు రఘురామ బెయిల్ మీద విడుదల కావడం సాధ్యం కాదని ఆయన  చెప్పారు.

click me!