ఆనందయ్యకు పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ భద్రత మధ్య ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు రక్షణ కల్పించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులను కోరారు. దీంతో ఆయనకు పోలీసు భద్రతను కల్పించారు.
నెల్లూరు: ఆనందయ్యకు పోలీసులు భారీ భద్రతను కల్పించారు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ భద్రత మధ్య ఆనందయ్య ఉన్నారు. ఆనందయ్యకు రక్షణ కల్పించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులను కోరారు. దీంతో ఆయనకు పోలీసు భద్రతను కల్పించారు.
also read:చట్టపరంగా ఆయుర్వేద మందు కాదు: ఆనందయ్య మందుపై ఆయుష్ కమిషనర్
undefined
నాలుగు రోజులుగా ఆనందయ్య మందును తయారు చేయడం లేదు. ఈ మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ పరిశోధన చేస్తోంది. ఆనందయ్య తయారు చేస్తున్న మందులో ఎలాంటి హానికారక పదార్ధాలు లేవని ఆయుష్ కమిషనర్ రాములు ప్రకటించారు. అయితే ఈ విషయమై జాతీయ ఆయుర్వేద పరిశోదన సంస్థ లోతుగా అధ్యయనం చేస్తోంది.
ఆనందయ్యను కృష్ణపట్నం పోర్టులో పోలీస్ భద్రత మధ్య ఉంచారు. ఆనందయ్యను కలిసేందుకు వస్తున్న వీఐపీలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆనందయ్యను కలిసేందుకు వచ్చాడు. అయితే ఆయనను కలిసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.