మహిళలను జగన్ దోచుకుంటున్నాడు.. ఒక్కో మహిళ నుంచి రూ.1.82లక్షలు దోపిడీ... రఘరామ

By SumaBala BukkaFirst Published Oct 30, 2023, 10:06 AM IST
Highlights

మహిళలకు అమ్మ ఒడి, చేయూత డబ్బులు వేస్తూ..వారి భర్తలనుంచి మద్యం పేరుతో దోచుకుంటున్నాడని ఆరోపణలు గుప్పించారు. 

ఢిల్లీ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. సీఎం జగన్ ఐదేళ్లలో మద్యం మీద ఒక్కో మహిళ నుంచి రూ.1.82 లక్షల దోచుకున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో రఘురామ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రఘురామ మద్యం ధరలతో వైఎస్ జగన్ మహిళలను కొల్లగొడుతున్నారని  విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో నాణ్యమైన మద్యం క్వార్టర్ ధర రూ.60 ఉండేదని..  కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.200 చేరిందని గుర్తు చేశారు. 

మహిళలకు అమ్మ ఒడి, చేయూత అంటూ డబ్బులేస్తున్న జగన్.. ఆ లబ్ధిదారులైన మహిళల భర్తలు  రోజుకు.. ఒక క్వార్టర్ మద్యం తాగుతున్నారని.. దీంతో ప్రభుత్వానికి  రోజుకు రూ.140 ఎక్కువ చెల్లిస్తున్నారని లెక్కలు చెప్పారు. అలా లెక్కిస్తూ పోతే వీరు ఒక్కొక్కరు ఏడాదికి దాదాపుగా రూ.50,400  ప్రభుత్వానికి  తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన లెక్కల  వివరాలను.. పథకాల వారిగా చెప్పుకొచ్చారు. 

రైలు ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లనున్న సీఎం జగన్, బాధితులకు పరామర్శ...

వైయస్ జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి లబ్ధిదారులకు రూ.13 వేలు ఇస్తోంది.  వారి భర్తలు రోజు మద్యం తాగడం ద్వారా ఈ 13వేల కంటే  అదనంగా రూ.37,400  చెల్లిస్తున్నారని తెలిపారు. చేయూత పథకంలో కూడా ఇదే జరుగుతుందని చెప్పారు. చేయూత కింద మహిళలకు రూ.15వేలు  ఇస్తుండగా…ఇవికాక వారి భర్తలు మద్యం తాగడం ద్వారా అదనంగా రూ.35,400 ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని చెప్పుకొచ్చారు.

అలా, ఈ ఐదేళ్లలో జగన్ ఒక్కో చేయూత లబ్దిదారు నుంచి రూ.1.77 లక్షలు, అమ్మ ఒడి లబ్ధిదారుడు నుంచి.. రూ.1,87,000 దోచుకున్నారని ఆరోపించారు. ఈ లెక్కలను బట్టి చూస్తే జగన్ ప్రభుత్వం సగటున ఒక్కో మహిళ నుంచి  దోచుకున్న మొత్తం రూ.1.82  లక్షలు గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక మే నెలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రానున్నాయని…ఈ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడం కోసం జగన్ ఓటుకు రూ.2నుంచి  మూడు వేలు ఇప్పిస్తాడని  జోస్యం చెప్పారు.

అయితే, వీటిని అపరాధ రుసుం కింద తీసుకొని.. వైసిపి వారికి మాత్రం ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. నాసిరకమైన మద్యం తాగి 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న చాలామంది మరణించినట్లుగా నివేదికలు ఉన్నాయని ఆవేదనతో చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసిపి పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదును చేపట్టిందన్నారు. దీని తిప్పికొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా, లేదా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. 

click me!